Toludane lonaidi tokkumetlimkanela

తొలుతనే లోనైతి తొక్కుమెట్లిఁకనేల
Language

(॥పల్లవి॥)
తొలుతనే లోనైతి తొక్కుమెట్లిఁకనేల
బలిమి సేయఁబోతేను పట్టిరాదు పాయము

(॥తొలు॥)
చేయివేయకుమీ నీవు చెమరించే నామేను
ఆయములు దాఁక మాటలాడఁగాను
మోయనీకుమీ గోరు ముంచుకొనెఁ బులకలు
ఆయెడ నీమేన నివి యంటీఁజుమ్మీ

(॥తొలు॥)
కొంగువట్టి తియ్యకుమీ గుబ్బతిలీ నూరుపులు
ముంగిటనుండి తప్పక మోము చూడఁగా
నింగిమోవ నవ్వకుమీ నిలువెల్లాఁ గాకరేఁగె
సంగడి నాప్రేమ నిన్ను జట్టిగొనఁ జేసును

(॥తొలు॥)
కాఁగిట బిగించకుమీ కళవట్టె నిదె నాకు
రేఁగి రేఁగి వలపులు రేఁచఁగాను
యేఁగివచ్చి శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
పాఁగిననాయధరము పచ్చాయ నిదివో

(||pallavi||)
tŏludane lonaidi tŏkkumĕṭlim̐kanela
balimi seyam̐bodenu paṭṭirādu pāyamu

(||tŏlu||)
seyiveyagumī nīvu sĕmariṁche nāmenu
āyamulu dām̐ka māḍalāḍam̐gānu
moyanīgumī goru muṁchugŏnĕm̐ bulagalu
āyĕḍa nīmena nivi yaṁṭīm̐jummī

(||tŏlu||)
kŏṁguvaṭṭi tiyyagumī gubbadilī nūrubulu
muṁgiḍanuṁḍi tappaga momu sūḍam̐gā
niṁgimova navvagumī niluvĕllām̐ gāgarem̐gĕ
saṁgaḍi nāprema ninnu jaṭṭigŏnam̐ jesunu

(||tŏlu||)
kām̐giḍa bigiṁchagumī kaḽavaṭṭĕ nidĕ nāgu
rem̐gi rem̐gi valabulu rem̐sam̐gānu
yem̐givachchi śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
pām̐ginanāyadharamu pachchāya nidivo