Toluda ninnum ditte dosagaarini

తొలుత నిన్నుఁ దిట్టే దోసకారిని
Language

(॥పల్లవి॥)
తొలుత నిన్నుఁ దిట్టే దోసకారిని
పలుమారు మాకేల బాఁతి పడేవయ్యా

(॥తొలు॥)
నిచ్చ నిచ్చ నీమీఁద నేరములు యెంచి యెంచి
పచ్చిసేసే నేనెంత పాపజాతిని
మచ్చరపువారమింతే మంచివారమా నీకు
యిచ్చగించి మాచెరఁగు యేల పట్టేవయ్యా

(॥తొలు॥)
యెవ్వతెఁ జూచేవో యంటానెంతైన నిన్ను నమ్మక
రవ్వసేసే నేనెంత రాఁపుదాననో
దవ్వుల పంతాలే కాక దయ వుట్టీనా మాకు
నవ్వులు మాతోనేల నటియించేవయ్యా

(॥తొలు॥)
పట్టి నీవే పెనఁగ బలిమిఁ దప్పించుకొనే
నెట్టన నే నెటువంటి నిష్టూరినో
దిట్టివై శ్రీవేంకటేశ తేజాన నన్నుఁ గూడితి-
విట్టె కడపలోననేల మొక్కేవయ్యా

(||pallavi||)
tŏluda ninnum̐ diṭṭe dosagārini
palumāru māgela bām̐ti paḍevayyā

(||tŏlu||)
nichcha nichcha nīmīm̐da neramulu yĕṁchi yĕṁchi
pachchisese nenĕṁta pābajādini
machcharabuvāramiṁte maṁchivāramā nīgu
yichchagiṁchi māsĕram̐gu yela paṭṭevayyā

(||tŏlu||)
yĕvvadĕm̐ jūsevo yaṁṭānĕṁtaina ninnu nammaga
ravvasese nenĕṁta rām̐pudānano
davvula paṁtāle kāga daya vuṭṭīnā māgu
navvulu mādonela naḍiyiṁchevayyā

(||tŏlu||)
paṭṭi nīve pĕnam̐ga balimim̐ dappiṁchugŏne
nĕṭṭana ne nĕḍuvaṁṭi niṣhṭūrino
diṭṭivai śhrīveṁkaḍeśha tejāna nannum̐ gūḍidi-
viṭṭĕ kaḍabalonanela mŏkkevayyā