తొలుత నెఱఁగవా తొయ్యలి లాగు
(॥పల్లవి॥)
తొలుత నెఱఁగవా తొయ్యలి లాగు
బలిమి చూపఁగనేల పంతమియ్యనేల
(॥॥)
వొడివట్టి తీసి నీవువొడఁబరచఁగ నిటె
కొడిమెలు నిన్ను నెంచి కొసరీనాపె
అడరి యప్పటి నీవు అవుఁగాము లాడుకోఁగా
బెడిదపుబెదవులు పిప్పి గట్టీ నిదివో
(॥॥)
కక్కఁసించి పెనఁగుచు కాఁగిలించి వేఁడుకోఁగా
చక్కఁ గిందవేసుకొని జరసీ నాపె
వెక్కసమై నీవందుకు వినయాలు నేయఁగాను
పక్కన నీసేఁతలెల్లాఁ బచ్చిదేరీ నిదివో
(॥॥)
శ్రీ వేంకటేశుఁడ యిట్టె చేరి నీవు గూడఁగాను
భావించి నీవురముపై నెక్కీ నాపె
వేవేగ నిప్పుడే నీవు విడెము చేతి కియ్యగా
చేవదేరి నీవలపు చిమ్మిరేగె నిదివో
(||pallavi||)
tŏluda nĕṟam̐gavā tŏyyali lāgu
balimi sūbam̐ganela paṁtamiyyanela
(||||)
vŏḍivaṭṭi tīsi nīvuvŏḍam̐barasam̐ga niḍĕ
kŏḍimĕlu ninnu nĕṁchi kŏsarīnābĕ
aḍari yappaḍi nīvu avum̐gāmu lāḍugom̐gā
bĕḍidabubĕdavulu pippi gaṭṭī nidivo
(||||)
kakkam̐siṁchi pĕnam̐gusu kām̐giliṁchi vem̐ḍugom̐gā
sakkam̐ giṁdavesugŏni jarasī nābĕ
vĕkkasamai nīvaṁdugu vinayālu neyam̐gānu
pakkana nīsem̐talĕllām̐ bachchiderī nidivo
(||||)
śhrī veṁkaḍeśhum̐ḍa yiṭṭĕ seri nīvu gūḍam̐gānu
bhāviṁchi nīvuramubai nĕkkī nābĕ
vevega nippuḍe nīvu viḍĕmu sedi kiyyagā
sevaderi nīvalabu simmiregĕ nidivo