తొలుత గుంపెన చూపి తోడనె ప్రియాలు చెప్పీ
(॥పల్లవి॥)
తొలుత గుంపెన చూపి తోడనె ప్రియాలు చెప్పీ
అలివేణిఁ గరుణించు మాఁపలేదు మనసు
(॥తొలు॥)
కాఁతాళించి చూచి నిన్నుఁ గమ్మటి వేఁడుకొనీని
యాఁతలు మోఁతలునాయ నింతి వలపు
బాఁతిపడి నిన్ను దూరి పాదాలకు మొక్కిని
చేఁతలకొలఁదిగావు చెలియపంతములు
(॥తొలు॥)
రాఁవుగ నిన్ను జంకించి రతికిఁ జేసన్నసేసీ
పూఁపలుఁబిందెలునాయ పొలఁతి యాస
యేపుల నిన్ను సొలసి ఇచ్చకములే సేసీ
మోపులకొలఁది గావు ముదిత నేరుపులు
(॥తొలు॥)
గండుమీరి నిన్ను నవ్వి కడవినయము సేసీ
కొండలుఁ గోట్లునాయ కొమ్మల కాంగిలి
వుండిండి శ్రీవేంకటేశ వుబ్బురేఁచి మోవియానీ
బండ్లకొలఁది గాపు భామ కాఁపురములు
(||pallavi||)
tŏluda guṁpĕna sūbi toḍanĕ priyālu sĕppī
aliveṇim̐ garuṇiṁchu mām̐paledu manasu
(||tŏlu||)
kām̐tāḽiṁchi sūsi ninnum̐ gammaḍi vem̐ḍugŏnīni
yām̐talu mom̐talunāya niṁti valabu
bām̐tibaḍi ninnu dūri pādālagu mŏkkini
sem̐talagŏlam̐digāvu sĕliyabaṁtamulu
(||tŏlu||)
rām̐vuga ninnu jaṁkiṁchi radigim̐ jesannasesī
pūm̐palum̐biṁdĕlunāya pŏlam̐ti yāsa
yebula ninnu sŏlasi ichchagamule sesī
mobulagŏlam̐di gāvu mudida nerubulu
(||tŏlu||)
gaṁḍumīri ninnu navvi kaḍavinayamu sesī
kŏṁḍalum̐ goṭlunāya kŏmmala kāṁgili
vuṁḍiṁḍi śhrīveṁkaḍeśha vubburem̐si moviyānī
baṁḍlagŏlam̐di gābu bhāma kām̐puramulu