తొల్లిటివలెనా నీవు దొర వైతివి
(॥పల్లవి॥)
తొల్లిటివలెనా నీవు దొర వైతివి
యెల్లవారుఁ జూడఁగా నేనే మందు నిఁకను
(॥తొల్లిటి॥)
యేరా నే వద్ద నుండఁగ యెవ్వతెదిక్కు చూచేవు
మేర మీర దొరకొంటి మెల్ల మెల్లనె
తేరా నా వుంగరము తెలిసితి నీ గుణము
వోరి నీతో జగడించ నోపరా నే నిఁకను
(॥తొల్లిటి॥)
నా యెదురుకట్టులనె నవ్వఁ బొయ్యే వాపెతోడ
యీయెడ నప్పుడె యెంత కెత్తుకొంటివి
చేయి విడువర నీతో చెలిమి నా కయి వచ్చె
చాయలు నే వెంగె మాడఁ జాలరా నిన్నిఁకను
(॥తొల్లిటి॥)
యిట్టె నా యింటనుండి యిల్లురికి మాటాడేవు
తిట్టీ నంటా నాపె నిదె సందుగా
గట్టిగా శ్రీవేంకటేశ కలసితి విదె నన్ను
పట్టినచలము చెల్లె బ్రదుకరా యిఁకనూ
(||pallavi||)
tŏlliḍivalĕnā nīvu dŏra vaidivi
yĕllavārum̐ jūḍam̐gā nene maṁdu nim̐kanu
(||tŏlliḍi||)
yerā ne vadda nuṁḍam̐ga yĕvvadĕdikku sūsevu
mera mīra dŏragŏṁṭi mĕlla mĕllanĕ
terā nā vuṁgaramu tĕlisidi nī guṇamu
vori nīdo jagaḍiṁcha nobarā ne nim̐kanu
(||tŏlliḍi||)
nā yĕdurugaṭṭulanĕ navvam̐ bŏyye vābĕdoḍa
yīyĕḍa nappuḍĕ yĕṁta kĕttugŏṁṭivi
seyi viḍuvara nīdo sĕlimi nā kayi vachchĕ
sāyalu ne vĕṁgĕ māḍam̐ jālarā ninnim̐kanu
(||tŏlliḍi||)
yiṭṭĕ nā yiṁṭanuṁḍi yillurigi māḍāḍevu
tiṭṭī naṁṭā nābĕ nidĕ saṁdugā
gaṭṭigā śhrīveṁkaḍeśha kalasidi vidĕ nannu
paṭṭinasalamu sĕllĕ bradugarā yim̐kanū