Tollidi taam daane kaamdaa dorayaayanaa

తొల్లిటి తాఁ దానే కాఁడా దొరయాయనా
Language

(॥పల్లవి॥)
తొల్లిటి తాఁ దానే కాఁడా దొరయాయనా
అల్లనాఁటి తగవు నేఁ డందదాయనా

(॥తొల్లి॥)
చాయల నే రానంటా సణఁగులాడేవాఁడు
కాయముఁ దానంటఁగా నేఁ గాదంటినా
పాయపుసతులత మింతే బలుమగవాఁడు దాను
పాయక గొల్లెతలను పచ్చి సేయఁడాయనా

(॥తొల్లి॥)
కన్నులఁ దిట్టితినంటా ఘాతలు సేసేఁవాడు
సన్నచేసి పిలువంగాఁ జరసితినా
కన్నెలము ఇదె నేము ఘనమైనప్రౌఢ దాను
మున్నే ఎరుకచేసితే మొగిఁ జెల్లదాయనా

(॥తొల్లి॥)
కులికి గోరంటితేను కోపగించేవాఁడు నన్ను
పలుసోఁకించఁగ నేను పదరితినా
యెలమి శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
ఆలమి పదారువేల నంగవించఁడాయనా

(||pallavi||)
tŏlliḍi tām̐ dāne kām̐ḍā dŏrayāyanā
allanām̐ṭi tagavu nem̐ ḍaṁdadāyanā

(||tŏlli||)
sāyala ne rānaṁṭā saṇam̐gulāḍevām̐ḍu
kāyamum̐ dānaṁṭam̐gā nem̐ gādaṁṭinā
pāyabusadulada miṁte balumagavām̐ḍu dānu
pāyaga gŏllĕdalanu pachchi seyam̐ḍāyanā

(||tŏlli||)
kannulam̐ diṭṭidinaṁṭā ghādalu sesem̐vāḍu
sannasesi piluvaṁgām̐ jarasidinā
kannĕlamu idĕ nemu ghanamainaprauḍha dānu
munne ĕrugaseside mŏgim̐ jĕlladāyanā

(||tŏlli||)
kuligi goraṁṭidenu kobagiṁchevām̐ḍu nannu
palusom̐kiṁcham̐ga nenu padaridinā
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
ālami padāruvela naṁgaviṁcham̐ḍāyanā