Tollidi ne numdagaanu dorageenaa tanagu

తొల్లిటి నే నుండగాను దొరకీనా తనకు
Language

(॥పల్లవి॥)
తొల్లిటి నే నుండగాను దొరకీనా తనకు
మల్లాడఁ బోతే వలపు మరి గొంటు పడదా

(॥తొల్లి॥)
రచ్చకెక్కి తానెంత రాజసము చూపీనా నీ-
విచ్చినంత చనవే కా యిత వయ్యేది
ఇచ్చకాన వలచి నాయింట నిట్టె వున్నాడవు
పచ్చి సేయ తన కంతబలు వున్నదా

(॥తొల్లి॥)
దిమ్ము రేగి తానెంత తిట్టులాడినా నీవు
సమ్మతించినంతే కా చవి పుట్టేది
కమ్ముక నాతో నీవు కాపరము సేసే నిదె
రమ్మని తాఁబిలువ కారణ మున్నదా

(॥తొల్లి॥)
జగము మెచ్చ తా నెంత సరసమాడినా నీవు
నగినయంతే కా నను పయ్యేది
తగిలి శ్రీవేంకటేశ దక్క నన్ను గూడితివి
తగ నలమేల్మంగను తనపంత మున్నదా

(||pallavi||)
tŏlliḍi ne nuṁḍagānu dŏragīnā tanagu
mallāḍam̐ bode valabu mari gŏṁṭu paḍadā

(||tŏlli||)
rachchagĕkki tānĕṁta rājasamu sūbīnā nī-
vichchinaṁta sanave kā yida vayyedi
ichchagāna valasi nāyiṁṭa niṭṭĕ vunnāḍavu
pachchi seya tana kaṁtabalu vunnadā

(||tŏlli||)
dimmu regi tānĕṁta tiṭṭulāḍinā nīvu
sammadiṁchinaṁte kā savi puṭṭedi
kammuga nādo nīvu kābaramu sese nidĕ
rammani tām̐biluva kāraṇa munnadā

(||tŏlli||)
jagamu mĕchcha tā nĕṁta sarasamāḍinā nīvu
naginayaṁte kā nanu payyedi
tagili śhrīveṁkaḍeśha dakka nannu gūḍidivi
taga nalamelmaṁganu tanabaṁta munnadā