Tolli neevu sesugonna doradodi nestamidi

తొల్లి నీవు చేసుకొన్న దొరతోడి నేస్తమిది
Language

(॥పల్లవి॥)
తొల్లి నీవు చేసుకొన్న దొరతోడి నేస్తమిది
యిల్లిదె యీతఁడే వచ్చి యీడేర్చీఁగాక

(॥॥)
చిగిరించినవలపు చేగలెక్కకుండునా
తగులైనపొందులు తప్పిపోవునా
నగినచిరునవ్వులు నామువారకుండునా
వెగటువిరహమున వేఁగనేలే యిపుడు

(॥॥)
మేనిమీఁది జవ్వనము మేరమీరకుండునా
తానకపుకోరికలు దాఁగనిచ్చునా
పూని చూచిన చూపులు బుద్దివుట్టించకుండునా
సూనాస్త్రములకేల జోడించేవే ఇపుడు

(॥॥)
సిగ్గరినీ వేడుకలు చిమ్మిరేఁచకుండునా
అగ్గలపు చక్కఁదన మడఁగించునా
వెగ్గళిం చెలమేల్మంగవిభుఁడి శ్రీ వేంకటేశు
డగ్గమై నిన్నేలె నీయాస లూరకుండునా

(||pallavi||)
tŏlli nīvu sesugŏnna dŏradoḍi nestamidi
yillidĕ yīdam̐ḍe vachchi yīḍersīm̐gāga

(||||)
sigiriṁchinavalabu segalĕkkaguṁḍunā
tagulainabŏṁdulu tappibovunā
naginasirunavvulu nāmuvāraguṁḍunā
vĕgaḍuvirahamuna vem̐ganele yibuḍu

(||||)
menimīm̐di javvanamu meramīraguṁḍunā
tānagabugorigalu dām̐ganichchunā
pūni sūsina sūbulu buddivuṭṭiṁchaguṁḍunā
sūnāstramulagela joḍiṁcheve ibuḍu

(||||)
siggarinī veḍugalu simmirem̐saguṁḍunā
aggalabu sakkam̐dana maḍam̐giṁchunā
vĕggaḽiṁ sĕlamelmaṁgavibhum̐ḍi śhrī veṁkaḍeśhu
ḍaggamai ninnelĕ nīyāsa lūraguṁḍunā