Tolli imta neruduvaa doravaide naudugaaga

తొల్లి ఇంత నేరుతువా దొరవైతే నౌదుగాక
Language

(॥పల్లవి॥)
తొల్లి ఇంత నేరుతువా దొరవైతే నౌదుగాక
చల్లఁగా నిన్ను రేఁచేది జాణ ఆపెకాదా

(॥తొల్లి॥)
తగవులు చెప్పేది తమకము వుట్టించేది
అగపడి నీకేపొద్దు నాపె కాదా
నగవులు నవ్వేది ననుపులు సేసేది
నిగిడి యన్నిటా దిద్దె నిన్ను నాపె కాదా

(॥తొల్లి॥)
గుట్టు నీకుఁ జెప్పేది కొలువులు సేయించేది
అట్టె నిన్నుఁ బనిగొనే దాపె కాదా
చుట్టరికము చేసేది సొరిది గద్దె యెక్కేది
పట్టపు దేవులైన దిప్పటి టాపె కాదా

(॥తొల్లి॥)
కడు నిన్ను మెచ్చినది కాఁగిటఁ జొక్కించినది
అడియాలాలు చేసిన దాపె కాదా
యెడయక శ్రీ వేంకటేశ నన్ను నేలితివి
వొడఁబరచెను నిన్నిప్పుడు నాపె కాదా

(||pallavi||)
tŏlli iṁta neruduvā dŏravaide naudugāga
sallam̐gā ninnu rem̐sedi jāṇa ābĕgādā

(||tŏlli||)
tagavulu sĕppedi tamagamu vuṭṭiṁchedi
agabaḍi nīgebŏddu nābĕ kādā
nagavulu navvedi nanubulu sesedi
nigiḍi yanniḍā diddĕ ninnu nābĕ kādā

(||tŏlli||)
guṭṭu nīgum̐ jĕppedi kŏluvulu seyiṁchedi
aṭṭĕ ninnum̐ banigŏne dābĕ kādā
suṭṭarigamu sesedi sŏridi gaddĕ yĕkkedi
paṭṭabu devulaina dippaḍi ṭābĕ kādā

(||tŏlli||)
kaḍu ninnu mĕchchinadi kām̐giḍam̐ jŏkkiṁchinadi
aḍiyālālu sesina dābĕ kādā
yĕḍayaga śhrī veṁkaḍeśha nannu nelidivi
vŏḍam̐barasĕnu ninnippuḍu nābĕ kādā