Tolleramgamaa nee doddadanamu

తొల్లెరఁగమా నీ దొడ్డతనము
Language

(॥పల్లవి॥)
తొల్లెరఁగమా నీ దొడ్డతనము
పల్లద మింతయును నీపాలిటిదే కాదా

(॥తొల్లె॥)
వూని రమణుని జూచి వురము దట్టుకొనేవు
కానీవే రట్టిడివంత గావా నీవు
వీనుల వినందరు నవ్వేరంటా నుంటివి గాక
శేన తిట్టులెల్లాఁ దిట్టి చెల్లించుకోలేవా

(॥తొల్లె॥)
పచ్చి దొర్ల నాతనితో పంతము లాడుకొనేవు
వొచ్చెము లేక పెనఁగనోపవా నీవు
విచ్చనవిడా డీకెకు వెరచి వుంటవి గాక
తచ్చి రాఁగతనపు చేఁతల మించలేవా

(॥తొల్లె॥)
శ్రీవేంకటేశు రతులఁ జెంది కడుఁ జొక్కించేవు
లేవే యింత సలిగె లేదా నీకు
కోవిదుఁ డాతని నేనే కూడఁగా నుంటివి గాక
నీ వొళ్ళి గబ్బితనము నెరపఁగ లేవా

(||pallavi||)
tŏllĕram̐gamā nī dŏḍḍadanamu
pallada miṁtayunu nībāliḍide kādā

(||tŏllĕ||)
vūni ramaṇuni jūsi vuramu daṭṭugŏnevu
kānīve raṭṭiḍivaṁta gāvā nīvu
vīnula vinaṁdaru navveraṁṭā nuṁṭivi gāga
śhena tiṭṭulĕllām̐ diṭṭi sĕlliṁchugolevā

(||tŏllĕ||)
pachchi dŏrla nādanido paṁtamu lāḍugŏnevu
vŏchchĕmu lega pĕnam̐ganobavā nīvu
vichchanaviḍā ḍīgĕgu vĕrasi vuṁṭavi gāga
tachchi rām̐gadanabu sem̐tala miṁchalevā

(||tŏllĕ||)
śhrīveṁkaḍeśhu radulam̐ jĕṁdi kaḍum̐ jŏkkiṁchevu
leve yiṁta saligĕ ledā nīgu
kovidum̐ ḍādani nene kūḍam̐gā nuṁṭivi gāga
nī vŏḽḽi gabbidanamu nĕrabam̐ga levā