తొల్లే నీయాల నేను దోసానకు లోనుగాను
(॥పల్లవి॥)
తొల్లే నీయాల నేను దోసానకు లోనుగాను
చల్లనాయ నామనసు జరయనేలయ్యా
(॥తొల్లే॥)
బాసికము గట్టితివి భామకాలు మెట్టితివి
చేసినచేఁతలు నీకుఁ జెల్లెనయ్యా
బాసలెల్లా నీడేరె పచ్చినవ్వులు దైవారె
యేసుద్దులు విన్నవించ నిఁకనేలయ్యా
(॥తొల్లే॥)
పెండిలిపీఁ టెక్కితివి ప్రేమిఁ జెక్కునొక్కితివి
అండనే సతికిఁ బతివైతివయ్యా
దుండగాలెల్లా దక్కె సంతోసాలు చేచిక్కె
చండిపెట్టి నిన్ను నంత సాదించనేలయ్యా
(॥తొల్లే॥)
వీడెము లందుకొంటివి వెలఁది గైకొంటివి
తొడనే నీకోరికెలు దొరసేనయ్యా
యీడనె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
వొడక రతుల నిన్ను నొరయ నేలయ్యా
(||pallavi||)
tŏlle nīyāla nenu dosānagu lonugānu
sallanāya nāmanasu jarayanelayyā
(||tŏlle||)
bāsigamu gaṭṭidivi bhāmagālu mĕṭṭidivi
sesinasem̐talu nīgum̐ jĕllĕnayyā
bāsalĕllā nīḍerĕ pachchinavvulu daivārĕ
yesuddulu vinnaviṁcha nim̐kanelayyā
(||tŏlle||)
pĕṁḍilibīm̐ ṭĕkkidivi premim̐ jĕkkunŏkkidivi
aṁḍane sadigim̐ badivaidivayyā
duṁḍagālĕllā dakkĕ saṁtosālu sesikkĕ
saṁḍibĕṭṭi ninnu naṁta sādiṁchanelayyā
(||tŏlle||)
vīḍĕmu laṁdugŏṁṭivi vĕlam̐di gaigŏṁṭivi
tŏḍane nīgorigĕlu dŏrasenayyā
yīḍanĕ śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
vŏḍaga radula ninnu nŏraya nelayyā