తొల్లే నీకంటే నే దొడ్డదాననా
(॥పల్లవి॥)
తొల్లే నీకంటే నే దొడ్డదాననా
బల్లిదుఁడ నీవే నన్ను పాలింతువు గాకా
(॥తొల్లే॥)
చిత్తము రా నీకు నే సేవ సేయఁ గలనా
సత్తగు నీ దయ నాపైఁ జల్లుదు గాక
నిత్తెము నిన్ను మెప్పించ నేరుతునా యే మైనా
కొత్తగా నన్నిట్టే దిద్దుకొందువు గాకా
(॥తొల్లే॥)
యిట్టి దని నీ మహిమ యెరుఁగుదునా నేను
నెట్టన బుద్ది చెప్ప మన్నింతు గాకా
వొట్టి నీకు విన్నవించ నోపఁ గలనా నేను
వట్టి నీవే తెలుసుక పయికొందువు గాకా
(॥తొల్లే॥)
కందువ లెరిఁగి నిన్ను కాంగిలించఁ గలనా
అందాలు సేసుక నీవే అంటుదు గాక
యిందుకే శ్రీవెంకటేశ యియ్యకొని కూడితివి
మందలించఁ గలానా మరుగుదు గాకా
(||pallavi||)
tŏlle nīgaṁṭe ne dŏḍḍadānanā
ballidum̐ḍa nīve nannu pāliṁtuvu gāgā
(||tŏlle||)
sittamu rā nīgu ne seva seyam̐ galanā
sattagu nī daya nābaim̐ jalludu gāga
nittĕmu ninnu mĕppiṁcha nerudunā ye mainā
kŏttagā nanniṭṭe diddugŏṁduvu gāgā
(||tŏlle||)
yiṭṭi dani nī mahima yĕrum̐gudunā nenu
nĕṭṭana buddi sĕppa manniṁtu gāgā
vŏṭṭi nīgu vinnaviṁcha nobam̐ galanā nenu
vaṭṭi nīve tĕlusuga payigŏṁduvu gāgā
(||tŏlle||)
kaṁduva lĕrim̐gi ninnu kāṁgiliṁcham̐ galanā
aṁdālu sesuga nīve aṁṭudu gāga
yiṁduge śhrīvĕṁkaḍeśha yiyyagŏni kūḍidivi
maṁdaliṁcham̐ galānā marugudu gāgā