తొల్లే నే మెరుఁగుదుము తొడిఁబడ నీ సుద్దులు
(॥పల్లవి॥)
తొల్లే నే మెరుఁగుదుము తొడిఁబడ నీ సుద్దులు
కల్లగాదు నిన్నప్పటి గరిసించ నేఁటికి
(॥॥)
యేతున నీవాడే మాటలిన్ని యునుఁ జెల్లివచ్చె
యీతల మాకోపమిఁక నెందుకెక్కును
జాతితో నీ నవ్వేనవ్వు సరివచ్చె మామీఁదను
నీతి చెప్పి పెనఁగఁగ నీతో నేల ఇఁకను
(॥॥)
పట్టిన నీచలములు పంతములకెల్లా నెక్కె
ఇట్టే నేవేఁడుకొనిన నేడకెక్కును
రట్టుసేసే నీవుద్దండా లిట్టే ఇంతటా నిండె
నెట్టుకొని బాసడుగ నీతోనేల ఇకఁను
(॥॥)
కందువ నీకూటమి కాఁగిటికి గురుతాయ
యిందరుఁ జెప్పే బుద్దులేడకెక్కును
సందిట శ్రీవేంకటేశ చనవిచ్చి కూడితివి
నిందలు వేయును నాడ నీతోనేల ఇఁకను
(||pallavi||)
tŏlle ne mĕrum̐gudumu tŏḍim̐baḍa nī suddulu
kallagādu ninnappaḍi garisiṁcha nem̐ṭigi
(||||)
yeduna nīvāḍe māḍalinni yunum̐ jĕllivachchĕ
yīdala māgobamim̐ka nĕṁdugĕkkunu
jādido nī navvenavvu sarivachchĕ māmīm̐danu
nīdi sĕppi pĕnam̐gam̐ga nīdo nela im̐kanu
(||||)
paṭṭina nīsalamulu paṁtamulagĕllā nĕkkĕ
iṭṭe nevem̐ḍugŏnina neḍagĕkkunu
raṭṭusese nīvuddaṁḍā liṭṭe iṁtaḍā niṁḍĕ
nĕṭṭugŏni bāsaḍuga nīdonela igam̐nu
(||||)
kaṁduva nīgūḍami kām̐giḍigi gurudāya
yiṁdarum̐ jĕppe budduleḍagĕkkunu
saṁdiḍa śhrīveṁkaḍeśha sanavichchi kūḍidivi
niṁdalu veyunu nāḍa nīdonela im̐kanu