తొల్లె ఇన్నిటా నీవు దొడ్డవాఁడవు
(॥పల్లవి॥)
తొల్లె ఇన్నిటా నీవు దొడ్డవాఁడవు
చెల్లఁబెట్టి యిందరితోఁ జెప్పఁగ నేమిటికి
(॥॥)
పలుకులఁ గరఁగించి భావములఁ జొక్కించి
నెలఁతల వలపించనేరవా నీవు
వెలయు గొల్లెతలెల్లా వెన్నతోఁ బెట్టిరి నీకు
పొలసి నీ మహిమలు పొగడ నేమిటికి
(॥॥)
ననుపులు గడుఁజేసి నయములట్టె చూపి
వొనరఁ బెండ్లిండ్లాడ నోపవా నీవు
చనవిచ్చి రుకుమిణి సాముసేయించెను నాఁడె
పెనఁగుచు మెచ్చి నిన్ను బ్బించఁగ నేమిటికి
(॥॥)
చెక్కులు వేమరు నొక్కి సేఁతలన్నియునుఁ జేసి
లెక్కలేనిరతి సేయలేవా నీవు
యిక్కువతో శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి
తక్కిననీపొందులెల్లాఁ దడవ నేమిటికి
(||pallavi||)
tŏllĕ inniḍā nīvu dŏḍḍavām̐ḍavu
sĕllam̐bĕṭṭi yiṁdaridom̐ jĕppam̐ga nemiḍigi
(||||)
palugulam̐ garam̐giṁchi bhāvamulam̐ jŏkkiṁchi
nĕlam̐tala valabiṁchaneravā nīvu
vĕlayu gŏllĕdalĕllā vĕnnadom̐ bĕṭṭiri nīgu
pŏlasi nī mahimalu pŏgaḍa nemiḍigi
(||||)
nanubulu gaḍum̐jesi nayamulaṭṭĕ sūbi
vŏnaram̐ bĕṁḍliṁḍlāḍa nobavā nīvu
sanavichchi rugumiṇi sāmuseyiṁchĕnu nām̐ḍĕ
pĕnam̐gusu mĕchchi ninnu bbiṁcham̐ga nemiḍigi
(||||)
sĕkkulu vemaru nŏkki sem̐talanniyunum̐ jesi
lĕkkaleniradi seyalevā nīvu
yikkuvado śhrī veṁkaḍeśha nannum̐ gūḍidivi
takkinanībŏṁdulĕllām̐ daḍava nemiḍigi