Tolle annidaa buddimamturaalavamammaa

తొల్లే అన్నిటా బుద్దిమంతురాలవమమ్మా
Language

(॥పల్లవి॥)
తొల్లే అన్నిటా బుద్దిమంతురాలవమమ్మా
చల్లఁగా నితనికి నొజ్జలవైతివమ్మా

(॥॥)
తొడమీఁదఁ గూచుండి దోసిలించి తలఁబాలు
విడువక చల్లేవమ్మా వేమారు నీవు
పడఁతి నీవిభుని కోపము మానుమని అవే
జడియకపెట్టే మంత్రాక్షతలాయనమ్మా

(॥॥)
ముసిముసి నవ్వులతో మొగము చూచి చూచి
యెగి ఆకుమడిచి యిచ్చేవమ్మా
వెస నీ మోవితేనెల విందులారగించుటకు
ఇసుమంత డేగపదనిచ్చినట్లమ్మా

(॥॥)
ఆరయ శ్రీవేంకటాద్రి ఆహొబలేశ్వరునిఁ
గూరిమితోఁ గాఁగిలించి కూడితివమ్మా
నేరుపుతో నితని నీసొమ్ముగాఁ జేసుకొని
ధారుణి పెట్టె బెట్టి దాఁచినట్లమ్మా

(||pallavi||)
tŏlle anniḍā buddimaṁturālavamammā
sallam̐gā nidanigi nŏjjalavaidivammā

(||||)
tŏḍamīm̐dam̐ gūsuṁḍi dosiliṁchi talam̐bālu
viḍuvaga sallevammā vemāru nīvu
paḍam̐ti nīvibhuni kobamu mānumani ave
jaḍiyagabĕṭṭe maṁtrākṣhadalāyanammā

(||||)
musimusi navvulado mŏgamu sūsi sūsi
yĕgi āgumaḍisi yichchevammā
vĕsa nī movidenĕla viṁdulāragiṁchuḍagu
isumaṁta ḍegabadanichchinaṭlammā

(||||)
āraya śhrīveṁkaḍādri āhŏbaleśhvarunim̐
gūrimidom̐ gām̐giliṁchi kūḍidivammā
nerubudo nidani nīsŏmmugām̐ jesugŏni
dhāruṇi pĕṭṭĕ bĕṭṭi dām̐sinaṭlammā