తొడిఁబడ సందు సుడి దొంగాడిని
(॥పల్లవి॥)
తొడిఁబడ సందు సుడి దొంగాడిని
వెడఁగుఁగొప్పు శిరసు వెన్నముద్ద కృష్టుఁడు
(॥తొడిఁ॥)
ఆదిగొని నేరాఁగా నఱచేతి వెన్నముద్ద
పాదుకొన నోర నిండాఁ బావుకొన్నాఁడు
సాదించీ నామాఁటాడఁ డచ్చమయ్యిన గోలవలె
యీదెసఁ జట్టిలో వెన్నయియ్యవచ్చీఁ జేతికి
(॥తొడిఁ॥)
కుత్తక బంటిదాఁకా గూనలో పాలెల్లాఁ దాగి
యెత్తుక వున్నాఁడు మొగ మిందుదాఁకాను
యెత్తుకొనఁ బిలిచితే యెంతైనాఁ గదలఁడు
వొత్తుపట్టి వూఁదుకొనీ నొకచేత నేలను
(॥తొడిఁ॥)
పెరగుమీఁగడలెల్ల పిన్నవాండ్ల కందిచ్చి
దొరవలె లోననుండి తొంగిచూచీని
యెరపు లేక శ్రీ వేంకటేశుఁడని మొక్కితేను
ఇరవైతినని నవ్వీ నిట్టె సెలవులను
(||pallavi||)
tŏḍim̐baḍa saṁdu suḍi dŏṁgāḍini
vĕḍam̐gum̐gŏppu śhirasu vĕnnamudda kṛṣhṭum̐ḍu
(||tŏḍim̐||)
ādigŏni nerām̐gā naṟasedi vĕnnamudda
pādugŏna nora niṁḍām̐ bāvugŏnnām̐ḍu
sādiṁchī nāmām̐ṭāḍam̐ ḍachchamayyina golavalĕ
yīdĕsam̐ jaṭṭilo vĕnnayiyyavachchīm̐ jedigi
(||tŏḍim̐||)
kuttaga baṁṭidām̐kā gūnalo pālĕllām̐ dāgi
yĕttuga vunnām̐ḍu mŏga miṁdudām̐kānu
yĕttugŏnam̐ biliside yĕṁtainām̐ gadalam̐ḍu
vŏttubaṭṭi vūm̐dugŏnī nŏgaseda nelanu
(||tŏḍim̐||)
pĕragumīm̐gaḍalĕlla pinnavāṁḍla kaṁdichchi
dŏravalĕ lonanuṁḍi tŏṁgisūsīni
yĕrabu lega śhrī veṁkaḍeśhum̐ḍani mŏkkidenu
iravaidinani navvī niṭṭĕ sĕlavulanu