Todambemdligoomturavaa toyyali neevu

తోడఁబెండ్లికూఁతురవా తొయ్యలి నీవు
Language

(॥పల్లవి॥)
తోడఁబెండ్లికూఁతురవా తొయ్యలి నీవు
బేడుకోలవై సందడిఁ బెండ్లాడ వచ్చేవు

(॥తోడఁ॥)
కడఁగి యాతఁడు వేరే కాంతఁ బేరఁ బిలువఁగా
యెడచొచ్చి పలికేవు యిదేమే నీవు
బడినే యాకెకు మరి బాగా లొసఁగఁగాను
నడుమఁ జేయొగ్గే విది నాయమౌనటే

(॥తోడఁ॥)
ఆముక చక్యనిదని యాకె నే పొగడఁగాను
నీ మోముఁ జూపవచ్చేవు నేరుపౌనటే
గోమునఁ దొడపై కాపెఁ గొంగువట్టి తియ్యఁగాను
యేమరించి కూచుండితి విది మేలే నీవు

(॥తోడఁ॥)
యెనసి యాతఁ డాకె తో నేకతాలు చెప్పఁగాను
వినే నంటా నీవేల వీను లొగ్గేవే
మన సాకెపై నుండఁగా మరి శ్రీవేంకటేశ్వరుఁ
జనుఁగవ నొత్తికూడ సంగతౌనా నీకు

(||pallavi||)
toḍam̐bĕṁḍligūm̐turavā tŏyyali nīvu
beḍugolavai saṁdaḍim̐ bĕṁḍlāḍa vachchevu

(||toḍam̐||)
kaḍam̐gi yādam̐ḍu vere kāṁtam̐ beram̐ biluvam̐gā
yĕḍasŏchchi paligevu yideme nīvu
baḍine yāgĕgu mari bāgā lŏsam̐gam̐gānu
naḍumam̐ jeyŏgge vidi nāyamaunaḍe

(||toḍam̐||)
āmuga sakyanidani yāgĕ ne pŏgaḍam̐gānu
nī momum̐ jūbavachchevu nerubaunaḍe
gomunam̐ dŏḍabai kābĕm̐ gŏṁguvaṭṭi tiyyam̐gānu
yemariṁchi kūsuṁḍidi vidi mele nīvu

(||toḍam̐||)
yĕnasi yādam̐ ḍāgĕ to negadālu sĕppam̐gānu
vine naṁṭā nīvela vīnu lŏggeve
mana sāgĕbai nuṁḍam̐gā mari śhrīveṁkaḍeśhvarum̐
janum̐gava nŏttigūḍa saṁgadaunā nīgu