తోడఁ బెండ్లియాడవద్దా దోమటి దొడుకవద్దా
(॥పల్లవి॥)
తోడఁ బెండ్లియాడవద్దా దోమటి దొడుకవద్దా
జోడు గూడి వుండవద్దా సుద్దులేమి చెప్పేవే
(॥॥)
సంతమాట లాడేవు సణఁగులు రాలిచేవు
యెంత లేదు నీపగటు యేమిచెప్పేదే
పంతాలాడేవు విభుఁడు బత్తి నాపైఁ జేసెనంటా
నింతగలదానవు నాఁడేడనుంటివే
(॥॥)
సన్నలనే సొలసేవు చలములు మెరసేవు
ఇన్నిటా నీదొరతన మేమి చెప్పేదే
కన్నులనే జంకించేవు కాంతుఁడు నావాఁడంటా
యెన్నికగలదానవు యేమరఁదగునా
(॥॥)
సందడి శ్రీవేంకటేశు సారె సారెఁ గూడేవు
ఇందరిలో నీనేర్పు లేమిచెప్పేదే
మందలించేవు యీతఁడు మచ్చిక నన్నేలెనంటా
పొందైనదాన విట్టె బుద్ది చెప్పవలదా
(||pallavi||)
toḍam̐ bĕṁḍliyāḍavaddā domaḍi dŏḍugavaddā
joḍu gūḍi vuṁḍavaddā suddulemi sĕppeve
(||||)
saṁtamāḍa lāḍevu saṇam̐gulu rālisevu
yĕṁta ledu nībagaḍu yemisĕppede
paṁtālāḍevu vibhum̐ḍu batti nābaim̐ jesĕnaṁṭā
niṁtagaladānavu nām̐ḍeḍanuṁṭive
(||||)
sannalane sŏlasevu salamulu mĕrasevu
inniḍā nīdŏradana memi sĕppede
kannulane jaṁkiṁchevu kāṁtum̐ḍu nāvām̐ḍaṁṭā
yĕnnigagaladānavu yemaram̐dagunā
(||||)
saṁdaḍi śhrīveṁkaḍeśhu sārĕ sārĕm̐ gūḍevu
iṁdarilo nīnerbu lemisĕppede
maṁdaliṁchevu yīdam̐ḍu machchiga nannelĕnaṁṭā
pŏṁdainadāna viṭṭĕ buddi sĕppavaladā