Todam bemdligoomturaa tolli taa nemainaanu

తోడఁ బెండ్లికూఁతురా తొల్లి తా నేమైనాను
Language

(॥పల్లవి॥)
తోడఁ బెండ్లికూఁతురా తొల్లి తా నేమైనాను
యేడనైనాఁ దన పొందు లెచ్చరించ వచ్చీని

(॥తోడఁ॥)
యేకతాన నితఁడు నే నిట్టె కత చెప్పుకోఁగా
వాకిట నదెవ్వతె వాయించీ వీణె
చేకొని లోకములోన సిగ్గరియాఁట దానికి
కాకరితనాల నింత గయ్యాళించఁ దగునా

(॥తోడఁ॥)
వెన్నెల బాయిట నేను వేడుకతో నుండఁగాను
సన్నల నదెవ్వతె చల్లీఁ బన్నీరు
మిన్నక దొరతనాన మెలఁగేయాఁట దానికి
పన్నుకొని యారజపు పనులేలే తనకు

(॥తోడఁ॥)
యింటిలోన శ్రీవేంకటేశుఁడు నన్నేలఁగాను
వెంటన చ్చిదెవ్వతె విడె మిచ్చీని
నంటున వాసితోడ ననిచినాఁట దానికి
దంటతనమున నింత తగులఁగ నేఁటికి

(||pallavi||)
toḍam̐ bĕṁḍligūm̐turā tŏlli tā nemainānu
yeḍanainām̐ dana pŏṁdu lĕchchariṁcha vachchīni

(||toḍam̐||)
yegadāna nidam̐ḍu ne niṭṭĕ kada sĕppugom̐gā
vāgiḍa nadĕvvadĕ vāyiṁchī vīṇĕ
segŏni logamulona siggariyām̐ṭa dānigi
kāgaridanāla niṁta gayyāḽiṁcham̐ dagunā

(||toḍam̐||)
vĕnnĕla bāyiḍa nenu veḍugado nuṁḍam̐gānu
sannala nadĕvvadĕ sallīm̐ bannīru
minnaga dŏradanāna mĕlam̐geyām̐ṭa dānigi
pannugŏni yārajabu panulele tanagu

(||toḍam̐||)
yiṁṭilona śhrīveṁkaḍeśhum̐ḍu nannelam̐gānu
vĕṁṭana schidĕvvadĕ viḍĕ michchīni
naṁṭuna vāsidoḍa nanisinām̐ṭa dānigi
daṁṭadanamuna niṁta tagulam̐ga nem̐ṭigi