Tittinaa veṟava vemtadittadaname

తిట్టినా వెఱవ వెంతదిట్టతనమే
Language

(॥పల్లవి॥)
తిట్టినా వెఱవ వెంతదిట్టతనమే
గుట్టు విడిచితి వెంత గొంట వైతివే

(॥తిట్టి॥)
నావద్దనున్న పతితో నవ్వులు నవ్వేవు నీవు
చేవదేర నీకెంట చెల్లుబడే
కావికన్నులఁ నాతని గమ్మటి నాఁటఁ జూచేవు
తావికొని యెంత గబ్బితనమే నీది

(॥తిట్టి॥)
పొత్తుల మాయిద్దరికి పోరచి వెట్ట వచ్చేవు
యిత్తల నీపెద్దరిక మెంతగలదే
సత్తుగాఁ బైకొసరులు జాణతనాలూ నాడేవు
కొత్తగాఁ బోతర మింత కూడఁ బెట్టుకొంటివా

(॥తిట్టి॥)
నన్నిట్టె కూడినవాని నయగారాలఁ బెట్టేవు
కన్నె వోయమ్మ యెంతగామిడివే
ఇన్నిటా శ్రీవేంకటేశు నెలయించి చెనకేవు
సన్నల చాయలనే సవతివైతివా

(||pallavi||)
tiṭṭinā vĕṟava vĕṁtadiṭṭadaname
guṭṭu viḍisidi vĕṁta gŏṁṭa vaidive

(||tiṭṭi||)
nāvaddanunna padido navvulu navvevu nīvu
sevadera nīgĕṁṭa sĕllubaḍe
kāvigannulam̐ nādani gammaḍi nām̐ṭam̐ jūsevu
tāvigŏni yĕṁta gabbidaname nīdi

(||tiṭṭi||)
pŏttula māyiddarigi porasi vĕṭṭa vachchevu
yittala nībĕddariga mĕṁtagalade
sattugām̐ baigŏsarulu jāṇadanālū nāḍevu
kŏttagām̐ bodara miṁta kūḍam̐ bĕṭṭugŏṁṭivā

(||tiṭṭi||)
nanniṭṭĕ kūḍinavāni nayagārālam̐ bĕṭṭevu
kannĕ voyamma yĕṁtagāmiḍive
inniḍā śhrīveṁkaḍeśhu nĕlayiṁchi sĕnagevu
sannala sāyalane savadivaidivā