తిట్టితేనే పదవినే(ని?) తేనె గారీనే
(॥పల్లవి॥)
తిట్టితేనే పదవినే(ని?) తేనె గారీనే
గట్టియాయ నీపనులు కానీలేవే
(॥తిట్టి॥)
నీమనసువచ్చునటే నెలఁతా
చేముట్టి నీవు నవ్వఁగఁ జేరి వుండితి
యేమిటికి నవ్వేవే యింతలో నీవు
కామినివంటా నుంటిఁ గానీలేవే
(॥తిట్టి॥)
పంతము చెల్లెనటవే పడఁతీ
మంతనాన నీకు నాకుమడిచిచ్చితి
రంతులేల సేసేవే రచ్చల నన్ను యే-
కాంతమున నీకుఁ జెప్పేఁ గానీలేవే
(॥తిట్టి॥)
కలసితి పన్నిటాను కలికీ
బలిమి శ్రీవేంకటాద్రిపతినే తానుఁ
చలపట్టి యింతయేల సాదించేవే
కలిగె నీదయ నాపైఁ గానీలేవే
(||pallavi||)
tiṭṭidene padavine(ni?) tenĕ gārīne
gaṭṭiyāya nībanulu kānīleve
(||tiṭṭi||)
nīmanasuvachchunaḍe nĕlam̐tā
semuṭṭi nīvu navvam̐gam̐ jeri vuṁḍidi
yemiḍigi navveve yiṁtalo nīvu
kāminivaṁṭā nuṁṭim̐ gānīleve
(||tiṭṭi||)
paṁtamu sĕllĕnaḍave paḍam̐tī
maṁtanāna nīgu nāgumaḍisichchidi
raṁtulela seseve rachchala nannu ye-
kāṁtamuna nīgum̐ jĕppem̐ gānīleve
(||tiṭṭi||)
kalasidi panniḍānu kaligī
balimi śhrīveṁkaḍādribadine tānum̐
salabaṭṭi yiṁtayela sādiṁcheve
kaligĕ nīdaya nābaim̐ gānīleve