Tittide nemiseduvu devaravainaa naidivi

తిట్టితే నేమిసేతువు దేవరవైనా నైతివి
Language

(॥పల్లవి॥)
తిట్టితే నేమిసేతువు దేవరవైనా నైతివి
గట్టువాయతనమునఁ గాలుదొక్కేవు

(॥తిట్టి॥)
చయ్యనఁ బరాకుమీఁద సకులతో మాటాడఁగా
పయ్యదకొంగు వట్టి భ్రమయించేవు
వూయ్యాలమంచముపై వూరకే వినోదించఁగ
గయ్యాళితనాన వచ్చి కాఁగిలించేవు

(॥తిట్టి॥)
వెలయఁగఁ గొనగోళ్ళ వీణె వాఇంచఁగాను
మలసి యదరిపు మర్మమంటేవు
పొలుపుమిగుల నేను పువ్వులు ముడుచుకోఁగా
కెలపుఁజేతల నేమి గిలిగించేవు

(॥తిట్టి॥)
ఇదివో ముచ్చటతో నే నేకతాన నుండఁగాను
కదిసి రతుల గూడి కరఁగించేవు
అదన శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
చెదరక మొక్కఁగాను చెక్కునొక్కేవు

(||pallavi||)
tiṭṭide nemiseduvu devaravainā naidivi
gaṭṭuvāyadanamunam̐ gāludŏkkevu

(||tiṭṭi||)
sayyanam̐ barāgumīm̐da sagulado māḍāḍam̐gā
payyadagŏṁgu vaṭṭi bhramayiṁchevu
vūyyālamaṁchamubai vūrage vinodiṁcham̐ga
gayyāḽidanāna vachchi kām̐giliṁchevu

(||tiṭṭi||)
vĕlayam̐gam̐ gŏnagoḽḽa vīṇĕ vāiṁcham̐gānu
malasi yadaribu marmamaṁṭevu
pŏlubumigula nenu puvvulu muḍusugom̐gā
kĕlabum̐jedala nemi giligiṁchevu

(||tiṭṭi||)
idivo muchchaḍado ne negadāna nuṁḍam̐gānu
kadisi radula gūḍi karam̐giṁchevu
adana śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
sĕdaraga mŏkkam̐gānu sĕkkunŏkkevu