Tirumajjanabuvela devunigi nidivo

తిరుమజ్జనపువేళ దేవునికి నిదివో
Language

(॥పల్లవి॥)
తిరుమజ్జనపువేళ దేవునికి నిదివో
పరగ నారదాదులు పాడరో యిందరును

(॥తిరు॥)
చింతదీర వేంచేసి సింహసనమున నుండి
దంతధావనాది కృత్యములు చేసి
సంతసాననంటరో సంపెంగ నూనియదెచ్చి
కాంతలు గందపుటటికలి వెట్టురో

(॥తిరు॥)
పంచామృతముల తోడ పన్నీట మజ్జనమాడె
కాంచనాంబరాలు గట్టె కస్తూరిపూసె
నించుకొనె సొమ్ములెల్లా నిలువు దండలు చాతె
పొంచి దూపదీపతాంబూలములొసఁగరో

(॥తిరు॥)
పాదుకలు వాహనాలు బహుఛత్రచామరాలు
ఆదరించె శంఖకాహళాదివాద్యాలు
వేదపారాయణలతో వెసఁజూచెఁ గపిలను
గాదెలలెక్కలడిగె గడేరాలు వినెను

(॥తిరు॥)
అంగరంగవైభవాలకరళుపాడులు వెట్టె
అంగపు నిత్యదానాదులన్నియుఁజెసె
చెంగటనలమేల్మంగ శ్రీ వెంకటేశుఁడు గూడి
ముంగిటిపారుపత్యములు చేసీని

(||pallavi||)
tirumajjanabuveḽa devunigi nidivo
paraga nāradādulu pāḍaro yiṁdarunu

(||tiru||)
siṁtadīra veṁchesi siṁhasanamuna nuṁḍi
daṁtadhāvanādi kṛtyamulu sesi
saṁtasānanaṁṭaro saṁpĕṁga nūniyadĕchchi
kāṁtalu gaṁdabuḍaḍigali vĕṭṭuro

(||tiru||)
paṁchāmṛtamula toḍa pannīḍa majjanamāḍĕ
kāṁchanāṁbarālu gaṭṭĕ kastūribūsĕ
niṁchugŏnĕ sŏmmulĕllā niluvu daṁḍalu sādĕ
pŏṁchi dūbadībadāṁbūlamulŏsam̐garo

(||tiru||)
pādugalu vāhanālu bahuchhatrasāmarālu
ādariṁchĕ śhaṁkhagāhaḽādivādyālu
vedabārāyaṇalado vĕsam̐jūsĕm̐ gabilanu
gādĕlalĕkkalaḍigĕ gaḍerālu vinĕnu

(||tiru||)
aṁgaraṁgavaibhavālagaraḽubāḍulu vĕṭṭĕ
aṁgabu nityadānādulanniyum̐jĕsĕ
sĕṁgaḍanalamelmaṁga śhrī vĕṁkaḍeśhum̐ḍu gūḍi
muṁgiḍibārubatyamulu sesīni