తేవయ్య విడెమిఁక తెగువేఁటికి
(॥పల్లవి॥)
తేవయ్య విడెమిఁక తెగువేఁటికి
వోవరి లోపలనే వొడఁబాటులాయను
(॥తేవయ్య॥)
బింకములాడినవెల్ల ప్రియము చెప్పినపుడే
సంకెలేక అన్నియునుఁ జక్కనాయను
మంకున నలిగినది మాటాడినంతలోనే
వుంకువతోడ మనసు వొక్కటాయను
(॥తేవయ్య॥)
చేతులు చాఁచినవెల్ల చేరి మొక్కినపుడే
నీతితోడఁ గోరికలు నెరవాయను
ఘాతల జంకించినవి కన్నుల నవ్వినపుడే
పోతరించి పాయరాని పొందులాయను
(॥తేవయ్య॥)
కరికరించినవెల్ల కాఁగిలించనపుడే
సరికి బేసికి లోలో జంటలాయను
యిరవై శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
విరసములెల్లఁ బాసి వేడుకాయను
(||pallavi||)
tevayya viḍĕmim̐ka tĕguvem̐ṭigi
vovari lobalane vŏḍam̐bāḍulāyanu
(||tevayya||)
biṁkamulāḍinavĕlla priyamu sĕppinabuḍe
saṁkĕlega anniyunum̐ jakkanāyanu
maṁkuna naliginadi māḍāḍinaṁtalone
vuṁkuvadoḍa manasu vŏkkaḍāyanu
(||tevayya||)
sedulu sām̐sinavĕlla seri mŏkkinabuḍe
nīdidoḍam̐ gorigalu nĕravāyanu
ghādala jaṁkiṁchinavi kannula navvinabuḍe
podariṁchi pāyarāni pŏṁdulāyanu
(||tevayya||)
karigariṁchinavĕlla kām̐giliṁchanabuḍe
sarigi besigi lolo jaṁṭalāyanu
yiravai śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭe
virasamulĕllam̐ bāsi veḍugāyanu