Tevayya veedemu temkuva neeyaalanaidi

తేవయ్య వీడెము తేఁకువ నీయాలనైతి
Language

(॥పల్లవి॥)
తేవయ్య వీడెము తేఁకువ నీయాలనైతి
దేవర వౌదువు తరితీపు తింకా వలెనా

(॥॥)
నీటుతోడ నాయెదుర నిలుచుండి వేరె వేరెఁ
మాటలాడే వవునయ్యా మతకానను
మూటవలపుల నీకు మొగమెల్లాఁ జెమరించె
యేఁటికిఁ జేసేవు నీవు యెమ్మెలు మాముందర

(॥॥)
రవ్వలుగా మాతోను రాజసము చూసి మోవిఁ
నవ్వులు నవ్వేవయ్యా నాలితనాన
చివ్వన నీతమకము చిగిరించెఁ బులకలై
నివ్వటిల్ల వేసాలేల నించేవు పంతానను

(॥॥)
చేపట్టి నన్నిటు గూడి చెలరేఁగి గుట్టు సేసి
చూపు లేమిచూచేవు సొలపులను
నాపాలిశ్రీవేంకటేశ నన్నుఁ గృపనేలితిని
ఆపని కిచ్చకా లెన్నియాడేవు తగిలి

(||pallavi||)
tevayya vīḍĕmu tem̐kuva nīyālanaidi
devara vauduvu taridību tiṁkā valĕnā

(||||)
nīḍudoḍa nāyĕdura nilusuṁḍi verĕ verĕm̐
māḍalāḍe vavunayyā madagānanu
mūḍavalabula nīgu mŏgamĕllām̐ jĕmariṁchĕ
yem̐ṭigim̐ jesevu nīvu yĕmmĕlu māmuṁdara

(||||)
ravvalugā mādonu rājasamu sūsi movim̐
navvulu navvevayyā nālidanāna
sivvana nīdamagamu sigiriṁchĕm̐ bulagalai
nivvaḍilla vesālela niṁchevu paṁtānanu

(||||)
sebaṭṭi nanniḍu gūḍi sĕlarem̐gi guṭṭu sesi
sūbu lemisūsevu sŏlabulanu
nābāliśhrīveṁkaḍeśha nannum̐ gṛpanelidini
ābani kichchagā lĕnniyāḍevu tagili