తేరిచూడ నిన్నీ నాకు దిష్టమాయను
(॥పల్లవి॥)
తేరిచూడ నిన్నీ నాకు దిష్టమాయను
రారాఁపు లిఁకనేల రమ్మనవే పతిని
(॥॥)
ఆడఁగనాడఁగ సరసాలాసలు వుట్టించును
చూడఁబోతే మోహములు చుట్టుకొనును
వాడిక దరచైతేఁ గైవశముగాఁ జేసును
యీడనే పంతము లాడనేలే నాకిఁకను
(॥॥)
వినఁగ వినఁగ మాట వేడుకలు వొడమించు
పెనఁగితేఁ దనువులు ప్రేమరేఁచును
మనిమని యేకతాలు మర్మములు గరఁగించు
యెనసి పంతములాడనేలే నాకిఁకను
(॥॥)
సేయఁ జేయఁ జెలుములు చిత్తములు మరిగించు
రాయడింపుఁ జెనకులు రతి వుట్టించు
పాయక శ్రీ వేంకటపతి నన్నుఁగూడినాఁడు
యేయెడఁ బంతములాడనేలే నాకిఁకను
(||pallavi||)
terisūḍa ninnī nāgu diṣhṭamāyanu
rārām̐pu lim̐kanela rammanave padini
(||||)
āḍam̐ganāḍam̐ga sarasālāsalu vuṭṭiṁchunu
sūḍam̐bode mohamulu suṭṭugŏnunu
vāḍiga darasaidem̐ gaivaśhamugām̐ jesunu
yīḍane paṁtamu lāḍanele nāgim̐kanu
(||||)
vinam̐ga vinam̐ga māḍa veḍugalu vŏḍamiṁchu
pĕnam̐gidem̐ danuvulu premarem̐sunu
manimani yegadālu marmamulu garam̐giṁchu
yĕnasi paṁtamulāḍanele nāgim̐kanu
(||||)
seyam̐ jeyam̐ jĕlumulu sittamulu marigiṁchu
rāyaḍiṁpum̐ jĕnagulu radi vuṭṭiṁchu
pāyaga śhrī veṁkaḍabadi nannum̐gūḍinām̐ḍu
yeyĕḍam̐ baṁtamulāḍanele nāgim̐kanu