Teraveyare siggulu dereem damagum damage

తెరవేయరే సిగ్గులు దేరీఁ దమకుఁ దమకే
Language

(॥పల్లవి॥)
తెరవేయరే సిగ్గులు దేరీఁ దమకుఁ దమకే
మరుఁడే బుద్దులు చెప్పీ మంతనపు వారికి

(॥తెర॥)
మనసుగలయు చోట మాటలు దానే తోఁచు
తనువులు సోఁకితేనే తమివుట్టును
పెనఁగులాడఁబూనితే ప్రియములు గడురేఁగు
మనము చెప్పవలెనా మగువకుఁ బతికి

(॥తెర॥)
చూపు చూపు నంటుకొంటే చుట్టరిక మొనరించు
యేపున నవ్వఁజొచ్చితే నిపులెసఁగు
కాఁపురాలు సేయఁగానే కళలు దానే కరఁగు
యీపనులు నేరిపేమా ఇంతికి విభునికి

(॥తెర॥)
యెప్పుడుఁ బాయకుండితే నేకములౌ మనసులు
ముప్పిరిఁ దగిలితేను మోహమెచ్చును
వొప్పిగఁ బానుపుమీఁద నొద్దికయై వున్నారు
చెప్పనేల సతికిని శ్రీ వేంకటేశునకు

(||pallavi||)
tĕraveyare siggulu derīm̐ damagum̐ damage
marum̐ḍe buddulu sĕppī maṁtanabu vārigi

(||tĕra||)
manasugalayu soḍa māḍalu dāne tom̐su
tanuvulu som̐kidene tamivuṭṭunu
pĕnam̐gulāḍam̐būnide priyamulu gaḍurem̐gu
manamu sĕppavalĕnā maguvagum̐ badigi

(||tĕra||)
sūbu sūbu naṁṭugŏṁṭe suṭṭariga mŏnariṁchu
yebuna navvam̐jŏchchide nibulĕsam̐gu
kām̐purālu seyam̐gāne kaḽalu dāne karam̐gu
yībanulu neribemā iṁtigi vibhunigi

(||tĕra||)
yĕppuḍum̐ bāyaguṁḍide negamulau manasulu
muppirim̐ dagilidenu mohamĕchchunu
vŏppigam̐ bānubumīm̐da nŏddigayai vunnāru
sĕppanela sadigini śhrī veṁkaḍeśhunagu