Teṟavagum badivaidivi gaaga

తెఱవకుఁ బతివైతివి గాక
Language

(॥పల్లవి॥)
తెఱవకుఁ బతివైతివి గాక
గఱిసించినఁ గడుఘనమా నీవు

(॥తెఱ॥)
చూచినవెల్లా సొంపుముత్యములు
పూచినపువ్వులె పున్నమలు
లాచినవెల్లా లాగవేగములు
యీచెలిసొబగుల కెదురా నీవు

(॥తెఱ॥)
పలికినవెల్లాఁ బసనివజ్రములు
నిలువునఁ దురుమే నీలములు
కలిగినపులకలె కనకపుమొలకలు
జలజలోచనకు సరియా నీవు

(॥తెఱ॥)
కాఁగిటివెల్లాఁ గంతునిరచనలు
మూఁగినరతి నిను ముంచె నిదె
చేఁగల చిగురుల శ్రీవేంకటపతి
వీఁగేటిరమణికి వింతా నీవు

(||pallavi||)
tĕṟavagum̐ badivaidivi gāga
gaṟisiṁchinam̐ gaḍughanamā nīvu

(||tĕṟa||)
sūsinavĕllā sŏṁpumutyamulu
pūsinabuvvulĕ punnamalu
lāsinavĕllā lāgavegamulu
yīsĕlisŏbagula kĕdurā nīvu

(||tĕṟa||)
paliginavĕllām̐ basanivajramulu
niluvunam̐ durume nīlamulu
kaliginabulagalĕ kanagabumŏlagalu
jalajalosanagu sariyā nīvu

(||tĕṟa||)
kām̐giḍivĕllām̐ gaṁtunirasanalu
mūm̐ginaradi ninu muṁchĕ nidĕ
sem̐gala sigurula śhrīveṁkaḍabadi
vīm̐geḍiramaṇigi viṁtā nīvu