Teṟava mokkamgaam biridiyyam dagavugaadu

తెఱవ మొక్కఁగాఁ బిరితియ్యఁ దగవుగాదు
Language

(॥పల్లవి॥)
తెఱవ మొక్కఁగాఁ బిరితియ్యఁ దగవుగాదు
గుఱిగా మన్నించవయ్య కొసరేల ఇఁకను

(॥॥)
పంతమాడ నేరుతువు భావించనేరుతువు
యింతులను లాలించ నెఱఁగవా
అంత నీవు సేసినందు కాకె యలిగివున్నది
సంతము సేసుకోవయ్య చలసేల యిఁకను

(॥॥)
పెనఁగనేరుతువు పెండ్లాడనేరుతువు
అనిశముఁ జనవియ్య నది నేరవా
యెనయ నిన్న రానందు కిటు మాటాడకున్నది
మనసు నమ్మించవయ్య మరఁగేల ఇకను

(॥॥)
కలయఁగనేరుతువు కాఁగిలించనేరుతువు
అలరి యురమున మోయఁగనోపవా
కలికి శ్రీ వేంకటేశ కైవశమై నీకున్నది
సెలవి నవ్వించవయ్య చెప్పనేల ఇఁకను

(||pallavi||)
tĕṟava mŏkkam̐gām̐ biridiyyam̐ dagavugādu
guṟigā manniṁchavayya kŏsarela im̐kanu

(||||)
paṁtamāḍa neruduvu bhāviṁchaneruduvu
yiṁtulanu lāliṁcha nĕṟam̐gavā
aṁta nīvu sesinaṁdu kāgĕ yaligivunnadi
saṁtamu sesugovayya salasela yim̐kanu

(||||)
pĕnam̐ganeruduvu pĕṁḍlāḍaneruduvu
aniśhamum̐ janaviyya nadi neravā
yĕnaya ninna rānaṁdu kiḍu māḍāḍagunnadi
manasu nammiṁchavayya maram̐gela iganu

(||||)
kalayam̐ganeruduvu kām̐giliṁchaneruduvu
alari yuramuna moyam̐ganobavā
kaligi śhrī veṁkaḍeśha kaivaśhamai nīgunnadi
sĕlavi navviṁchavayya sĕppanela im̐kanu