Teramaramgemtigi dishtamu vo seli

తెరమరఁగేఁటికి దిష్టము వో చెలి
Language

(॥పల్లవి॥)
తెరమరఁగేఁటికి దిష్టము వో చెలి
పురుష విరహ మిటు పొలసీని

(॥తెర॥)
వంచిన శిరనును వాలుక చూపులు
పెంచిన నెరుల యీ పెనుఁగొప్పు
మంచముపైఁ బతిమతిలోఁ దలఁచుచు
పొంచిన చెమటతోఁ బొరలీని

(॥తెర॥)
చెక్కిటిచెయి నీ సెలవుల నవ్వులు
పుక్కిటి వీడెపు భోగములు
వక్కణ నీతఁడు వాకునఁ బొగడుచు
గక్కన లోలోఁ గరఁగీని

(॥తెర॥)
మోవికెంపులును మొలకల పులకలు
సావధానమగు చనుకట్టు
భావించి కూడెను బలిమి నిన్ను నిటు
శ్రీ వేంకటేశుఁడు చెలఁగీని

(||pallavi||)
tĕramaram̐gem̐ṭigi diṣhṭamu vo sĕli
puruṣha viraha miḍu pŏlasīni

(||tĕra||)
vaṁchina śhiranunu vāluga sūbulu
pĕṁchina nĕrula yī pĕnum̐gŏppu
maṁchamubaim̐ badimadilom̐ dalam̐susu
pŏṁchina sĕmaḍadom̐ bŏralīni

(||tĕra||)
sĕkkiḍisĕyi nī sĕlavula navvulu
pukkiḍi vīḍĕbu bhogamulu
vakkaṇa nīdam̐ḍu vāgunam̐ bŏgaḍusu
gakkana lolom̐ garam̐gīni

(||tĕra||)
movigĕṁpulunu mŏlagala pulagalu
sāvadhānamagu sanugaṭṭu
bhāviṁchi kūḍĕnu balimi ninnu niḍu
śhrī veṁkaḍeśhum̐ḍu sĕlam̐gīni