తేనెపేరు నోర నంటేఁ దీపు వుట్టీనా
(॥పల్లవి॥)
తేనెపేరు నోర నంటేఁ దీపు వుట్టీనా
తాను నేనూఁ గలిగితేఁ దమకాన కేమే
(॥తేనె॥)
తనుపైఁ జేయివేసి తాప మడఁచినఁగాక
వనితలఁదా నంపగావచ్చీ నదేమే
కనుఁగొని మోవి నంటి కప్పుర మిచ్చినఁగాక
అనుఁగుమాటలవల్ల నైన దేమే
(॥తేనె॥)
కాఁగిట రతులఁ గూడి కరఁగించినఁగాక
కూఁగుల నవ్వులవల్లఁ గూడినదేమే
మూఁగుచుఁ బానుపుమీద ముచ్చటలాడినఁగాక
వీఁగి దవ్వులసన్నల వెలసినదేమే
(॥తేనె॥)
మదము లొలుక నటె మనసు లొక్కటి గాక
యెదురు మొక్కులవల్ల నిందునేమే
యిదివో శ్రీవేంకటేశఁ డిట్టే మన్నించెఁగాక
పదరి వూరక మేను పచ్చి సేసిననేమే
(||pallavi||)
tenĕberu nora naṁṭem̐ dību vuṭṭīnā
tānu nenūm̐ galigidem̐ damagāna keme
(||tenĕ||)
tanubaim̐ jeyivesi tāba maḍam̐sinam̐gāga
vanidalam̐dā naṁpagāvachchī nademe
kanum̐gŏni movi naṁṭi kappura michchinam̐gāga
anum̐gumāḍalavalla naina deme
(||tenĕ||)
kām̐giḍa radulam̐ gūḍi karam̐giṁchinam̐gāga
kūm̐gula navvulavallam̐ gūḍinademe
mūm̐gusum̐ bānubumīda muchchaḍalāḍinam̐gāga
vīm̐gi davvulasannala vĕlasinademe
(||tenĕ||)
madamu lŏluga naḍĕ manasu lŏkkaḍi gāga
yĕduru mŏkkulavalla niṁduneme
yidivo śhrīveṁkaḍeśham̐ ḍiṭṭe manniṁchĕm̐gāga
padari vūraga menu pachchi sesinaneme