తెలుసునో తెలియదో దిష్టముగ రమణుఁడ
(॥పల్లవి॥)
తెలుసునో తెలియదో దిష్టముగ రమణుఁడ
పిలుతుఁ జుమ్మీ కృపవెట్టేవని కాని
(॥॥)
మునివేళ్లు సోఁక నీకు మొక్కుదుఁ జుమ్మీ నేను
కొనగోరు దాఁకీనంటాఁ గొంకేఁ గాని
ననుపుచేసుక నీతో నవ్వుదుఁ జుమ్మీ ఇట్టె
వొనరఁ దగిలీనని వూరకుండితిఁ గాని
(॥॥)
పచ్చిదేరఁ బెండ్లాడి పాదము దొక్కుదుఁ జుమ్మీ
వొచ్చెమనేవని వూరకుందానఁ గాని
ముచ్చటదీర నీమోవి చవిచూతుఁ జుమ్మీ
మచ్చమంటేనని యనుమానించితిఁ గాని
(॥॥)
చెలరేఁగి కతలెల్లాఁ జెప్పుదుసుమ్మీ యెవ్వతేఁ
దలఁచుకొందువో యని తక్కితిఁ గాని
లలి శ్రీ వేంకటేశ నే నలమేలుమంగను
కలసితి విందుకె నేఁ గానిమ్మంటిఁ గాని
(||pallavi||)
tĕlusuno tĕliyado diṣhṭamuga ramaṇum̐ḍa
piludum̐ jummī kṛpavĕṭṭevani kāni
(||||)
muniveḽlu som̐ka nīgu mŏkkudum̐ jummī nenu
kŏnagoru dām̐kīnaṁṭām̐ gŏṁkem̐ gāni
nanubusesuga nīdo navvudum̐ jummī iṭṭĕ
vŏnaram̐ dagilīnani vūraguṁḍidim̐ gāni
(||||)
pachchideram̐ bĕṁḍlāḍi pādamu dŏkkudum̐ jummī
vŏchchĕmanevani vūraguṁdānam̐ gāni
muchchaḍadīra nīmovi savisūdum̐ jummī
machchamaṁṭenani yanumāniṁchidim̐ gāni
(||||)
sĕlarem̐gi kadalĕllām̐ jĕppudusummī yĕvvadem̐
dalam̐sugŏṁduvo yani takkidim̐ gāni
lali śhrī veṁkaḍeśha ne nalamelumaṁganu
kalasidi viṁdugĕ nem̐ gānimmaṁṭim̐ gāni