తెలుసుకోవే నాబుద్ది తేటతెల్లమిగాను
(॥పల్లవి॥)
తెలుసుకోవే నాబుద్ది తేటతెల్లమిగాను
ఇల నోరుపు గలితే నిన్నిటికి మంచిది
(॥తెలు॥)
వెంగెము దొలుత నాడి వెనక వేఁడికోవద్దు
ముంగిటనుండే పతికి మొక్కుట మేలు
కంగు వెట్టుకొని పాసి కాఁకలఁ బొరలవద్దు
అంగజకేలి మరిగి యాసపడేదానికి
(॥తెలు॥)
వూరకే వొట్టు వెట్టుక వుండలే కలయవద్దు
సారెకు గుట్టుతోనుండే శాంతమే మేలు
బీరముతోడఁ బెనఁగి ప్రియము చెప్పఁగవద్దు
మేరతో మగనిమీఁద మేలుగల దానికి
(॥తెలు॥)
యెఱఁగక సిగ్గువడి యెదురు చూడఁగవద్దు
మఱఁగులేక తగిలేమచ్చికే మేలు
గుఱిగా నిన్ను నిప్పుడే కూడె శ్రీ వేంకటేశుఁడు
నెఱయ నీతఁడు దక్కు నీవంటి దానికి
(||pallavi||)
tĕlusugove nābuddi teḍadĕllamigānu
ila norubu galide ninniḍigi maṁchidi
(||tĕlu||)
vĕṁgĕmu dŏluda nāḍi vĕnaga vem̐ḍigovaddu
muṁgiḍanuṁḍe padigi mŏkkuḍa melu
kaṁgu vĕṭṭugŏni pāsi kām̐kalam̐ bŏralavaddu
aṁgajageli marigi yāsabaḍedānigi
(||tĕlu||)
vūrage vŏṭṭu vĕṭṭuga vuṁḍale kalayavaddu
sārĕgu guṭṭudonuṁḍe śhāṁtame melu
bīramudoḍam̐ bĕnam̐gi priyamu sĕppam̐gavaddu
merado maganimīm̐da melugala dānigi
(||tĕlu||)
yĕṟam̐gaga sigguvaḍi yĕduru sūḍam̐gavaddu
maṟam̐gulega tagilemachchige melu
guṟigā ninnu nippuḍe kūḍĕ śhrī veṁkaḍeśhum̐ḍu
nĕṟaya nīdam̐ḍu dakku nīvaṁṭi dānigi