తెలుసుకోవయ్యా నీవే తెల్లమిగాను
(॥పల్లవి॥)
తెలుసుకోవయ్యా నీవే తెల్లమిగాను
అలివేణితో నవ్వి ఆదరించు మిపుడు
(॥తెలు॥)
మొక్కలాన నొకమాట ముంచి యాపె సొలసితే
వెక్కెసాలాడేవు నీవు వెల్లవిరిగా
యెక్కువైన కోవిలల యెలుఁగులు నిడివైతే
చక్కగా మరు నందుకు సాదించఁదగవా
(॥తెలు॥)
జవ్వనమదాన నాకె జంకించి చూచితేను
పువ్వులచెండునఁ దాఁకఁ బూఁచివేసేవు
పువ్వులేల్లా నమ్ములపాదులలో బాణాలైతే
నివ్వటిల్ల వసంతుని నేర మెంచఁదగవా
(॥తెలు॥)
తమకించి యాపె నిన్ను దండిగుబ్బల నొత్తితే
అమరఁ గాఁగిటిలోనే అలయించేవు
జమళి శ్రీవేంకటేశ జక్కవలు మదించితే
తిమిరి యాచెలిని సాదించ నీకుఁదగవా
(||pallavi||)
tĕlusugovayyā nīve tĕllamigānu
aliveṇido navvi ādariṁchu mibuḍu
(||tĕlu||)
mŏkkalāna nŏgamāḍa muṁchi yābĕ sŏlaside
vĕkkĕsālāḍevu nīvu vĕllavirigā
yĕkkuvaina kovilala yĕlum̐gulu niḍivaide
sakkagā maru naṁdugu sādiṁcham̐dagavā
(||tĕlu||)
javvanamadāna nāgĕ jaṁkiṁchi sūsidenu
puvvulasĕṁḍunam̐ dām̐kam̐ būm̐sivesevu
puvvulellā nammulabādulalo bāṇālaide
nivvaḍilla vasaṁtuni nera mĕṁcham̐dagavā
(||tĕlu||)
tamagiṁchi yābĕ ninnu daṁḍigubbala nŏttide
amaram̐ gām̐giḍilone alayiṁchevu
jamaḽi śhrīveṁkaḍeśha jakkavalu madiṁchide
timiri yāsĕlini sādiṁcha nīgum̐dagavā