Telusugommee yitte dikkula paraagu maani

తెలుసుకొమ్మీ యిట్టె దిక్కుల పరాకు మాని
Language

(॥పల్లవి॥)
తెలుసుకొమ్మీ యిట్టె దిక్కుల పరాకు మాని
ఫలించెఁ జుమ్మీ జవ్వనపాయమెల్లాను

(॥తెలు॥)
చిగురుటాకులను వ్రాసినమేలుసుద్దులే
మగువయాడేమంచి మాటలెల్లాను
మొగి ముత్తెపుఁజిప్పల మూసిదించినవే
వెగటైనచూపుల వెన్నెలలెల్లాను

(॥తెలు॥)
కమలపుపుటికల కలయ నీపైఁజల్లేవే
రమణిచేఁతలు సేసే రచనలెల్లా
అమర మరుగరిడి నటు సాములు చూపేదే
కొమరె నీతొడ మీఁదఁ గూచుండేదెల్లాను

(॥తెలు॥)
పువ్వులగుత్తుల నిన్నుఁ బూజలుసేసేదే
జవ్వని చన్నులనొత్తేసరసమెల్లా
రవ్వగా శ్రీవేంకటేశ రమణిఁ బెండ్లాడినదే
బువ్వపురతుల నీతోఁ బొత్తులు గూడినది

(||pallavi||)
tĕlusugŏmmī yiṭṭĕ dikkula parāgu māni
phaliṁchĕm̐ jummī javvanabāyamĕllānu

(||tĕlu||)
siguruḍāgulanu vrāsinamelusuddule
maguvayāḍemaṁchi māḍalĕllānu
mŏgi muttĕbum̐jippala mūsidiṁchinave
vĕgaḍainasūbula vĕnnĕlalĕllānu

(||tĕlu||)
kamalabubuḍigala kalaya nībaim̐jalleve
ramaṇisem̐talu sese rasanalĕllā
amara marugariḍi naḍu sāmulu sūbede
kŏmarĕ nīdŏḍa mīm̐dam̐ gūsuṁḍedĕllānu

(||tĕlu||)
puvvulaguttula ninnum̐ būjalusesede
javvani sannulanŏttesarasamĕllā
ravvagā śhrīveṁkaḍeśha ramaṇim̐ bĕṁḍlāḍinade
buvvaburadula nīdom̐ bŏttulu gūḍinadi