Telusugommanave devara maagum daanu

తెలుసుకొమ్మనవే దేవర మాకుఁ దాను
Language

(॥పల్లవి॥)
తెలుసుకొమ్మనవే దేవర మాకుఁ దాను
పొనుఁగక మా గుణాలు పొగడుకో నేటికే

(॥॥)
ననువు గలిగినంతే నాఁటుకొన్న ప్రియములు
మనసు గలిగినంతే మంగళము
పెనఁగి నందులోనే ప్రేమము గానఁగ వచ్చు
వినక నప్పటి మరి విన్నపము లేఁటికే

(॥॥)
చేకొనిన పాటే సేవలును
వాకునఁ గలపాటే వావులూ
యేకత మాడినందునే యింపు దెలుసు
పై కొన్న మోహములు పచారించ నేఁటికే

(॥॥)
సేసపాలలోనివే సిగ్గులూ
ఆస పడిన యింతే అంటుఁ గౌఁగిలి
యీసు లేక శ్రీ వేంకటేశుఁ డిట్టే నన్నుఁ గూడె
చేసిన చేతఁలెఁల్లా జెప్పి చూప నేఁటికే

(||pallavi||)
tĕlusugŏmmanave devara māgum̐ dānu
pŏnum̐gaga mā guṇālu pŏgaḍugo neḍige

(||||)
nanuvu galiginaṁte nām̐ṭugŏnna priyamulu
manasu galiginaṁte maṁgaḽamu
pĕnam̐gi naṁdulone premamu gānam̐ga vachchu
vinaga nappaḍi mari vinnabamu lem̐ṭige

(||||)
segŏnina pāḍe sevalunu
vāgunam̐ galabāḍe vāvulū
yegada māḍinaṁdune yiṁpu dĕlusu
pai kŏnna mohamulu pasāriṁcha nem̐ṭige

(||||)
sesabālalonive siggulū
āsa paḍina yiṁte aṁṭum̐ gaum̐gili
yīsu lega śhrī veṁkaḍeśhum̐ ḍiṭṭe nannum̐ gūḍĕ
sesina sedam̐lĕm̐llā jĕppi sūba nem̐ṭige