తెలుసుకొంద మన్నియుఁ దెల్లమిగాను
(॥పల్లవి॥)
తెలుసుకొంద మన్నియుఁ దెల్లమిగాను
కొలచి పెండ్లిపీఁటపైఁ గూచుండుమనవే
(॥తెలు॥)
మనసులోఁ గలమేలు మాటలలోఁ గానరాదా
అననీవే నీవేల వద్దనే విపుడు
ననిచినతమకము నవ్వులలోఁ గానవచ్చీ
అనుమానా లిఁకనేల అండకు రమ్మనవే
(॥తెలు॥)
జిగిగొన్నమన్ననలు చేఁతలలోఁ గానరాదా
మొగము చూడనియ్యవే మొక్కలమేల
మిగులాఁ గాఁక గలితే మేనిమీఁద గానవచ్చీ
వెగటు లిఁకనేఁటికి విడియ మిమ్మనవే
(॥తెలు॥)
చొక్కపు వేడుకలెల్లా చూపులలోఁ గానరాదా
నిక్కి తెరదియ్యనీవే నేరమెంచక
యిక్కువ శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁగూడె
మిక్కిలి నివ్వెరగేల మేల మాడు మనవే
(||pallavi||)
tĕlusugŏṁda manniyum̐ dĕllamigānu
kŏlasi pĕṁḍlibīm̐ṭabaim̐ gūsuṁḍumanave
(||tĕlu||)
manasulom̐ galamelu māḍalalom̐ gānarādā
ananīve nīvela vaddane vibuḍu
nanisinadamagamu navvulalom̐ gānavachchī
anumānā lim̐kanela aṁḍagu rammanave
(||tĕlu||)
jigigŏnnamannanalu sem̐talalom̐ gānarādā
mŏgamu sūḍaniyyave mŏkkalamela
migulām̐ gām̐ka galide menimīm̐da gānavachchī
vĕgaḍu lim̐kanem̐ṭigi viḍiya mimmanave
(||tĕlu||)
sŏkkabu veḍugalĕllā sūbulalom̐ gānarādā
nikki tĕradiyyanīve neramĕṁchaga
yikkuva śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐gūḍĕ
mikkili nivvĕragela mela māḍu manave