తెలుసుకో యింకా నీవే తేటతెల్లమిగాను
(॥పల్లవి॥)
తెలుసుకో యింకా నీవే తేటతెల్లమిగాను
చలపట్టనేల నీతో సాదించేవు
(॥॥)
మచ్చరించే దానఁ గాను మనసిచ్చే దానను
పచ్చిగా నాతో నేమి పచారించేవు
రచ్చవేసే దానఁ గాను రహస్యపు దానను
అచ్చలాన నన్ను నేల ఆన వెట్టేవు
(॥॥)
యెదురాడే దానఁ గాను యియ్యకొనేదానను
కదిసి మరేల నీవు కాకుసేసేవు
పదరేటి దానఁగాను బత్తిగలదానను
చెదరక నన్ను నేల చెక్కు నొక్కేవు
(॥॥)
పెనఁగేటిదానఁ గాను ప్రియపడేదానను
గనముగ నింత యేల కాఁతాళించేవు
యెనసితివి శ్రీవేంకటేశ యిట్టే నన్ను నీవు
చనవిచ్చి నాకెంత సారె లోఁగేవు
(||pallavi||)
tĕlusugo yiṁkā nīve teḍadĕllamigānu
salabaṭṭanela nīdo sādiṁchevu
(||||)
machchariṁche dānam̐ gānu manasichche dānanu
pachchigā nādo nemi pasāriṁchevu
rachchavese dānam̐ gānu rahasyabu dānanu
achchalāna nannu nela āna vĕṭṭevu
(||||)
yĕdurāḍe dānam̐ gānu yiyyagŏnedānanu
kadisi marela nīvu kāgusesevu
padareḍi dānam̐gānu battigaladānanu
sĕdaraga nannu nela sĕkku nŏkkevu
(||||)
pĕnam̐geḍidānam̐ gānu priyabaḍedānanu
ganamuga niṁta yela kām̐tāḽiṁchevu
yĕnasidivi śhrīveṁkaḍeśha yiṭṭe nannu nīvu
sanavichchi nāgĕṁta sārĕ lom̐gevu