తెలుసుకో యిఁక నీవు తెల్లవారె నీమాట
(॥పల్లవి॥)
తెలుసుకో యిఁక నీవు తెల్లవారె నీమాట
బలువుఁడ వీ రెంటి పంతము నీ చేతిది
(॥తెలు॥)
వేసరిన వారితోడ వింతసుద్దలెల్లాఁ జెప్పి
వాసులేల రేఁచేవు వద్దు వద్దు
నీసరివారమా నేము నీతో మారాడేమా
పోసరించి దయఁజూచేపుణ్యము నీచేతిది
(॥తెలు॥)
వూరకున్నవారిమీఁద వుమ్మగిలఁ జేయివేసి
సారెనేల పెనఁగేవు చాలుఁజాలు
నేరుపుగలవారమా నిన్నుఁగొసరఁగలమా
మేరతోడ నడుపేటిమేలెల్లా నీచేతిది
(॥తెలు॥)
కనుసన్ననుండేవారిఁ గాఁగిటఁ జొక్కించి కూడి
పన్ని యెంతమన్నించేవు భళిభళి
నన్నుఁ గలసితి విదె నమ్మించి శ్రీ వేంకటేశ
యెన్నికైనపేరుఁ గీర్తియింతయు నీచేతిది
(||pallavi||)
tĕlusugo yim̐ka nīvu tĕllavārĕ nīmāḍa
baluvum̐ḍa vī rĕṁṭi paṁtamu nī sedidi
(||tĕlu||)
vesarina vāridoḍa viṁtasuddalĕllām̐ jĕppi
vāsulela rem̐sevu vaddu vaddu
nīsarivāramā nemu nīdo mārāḍemā
posariṁchi dayam̐jūsebuṇyamu nīsedidi
(||tĕlu||)
vūragunnavārimīm̐da vummagilam̐ jeyivesi
sārĕnela pĕnam̐gevu sālum̐jālu
nerubugalavāramā ninnum̐gŏsaram̐galamā
meradoḍa naḍubeḍimelĕllā nīsedidi
(||tĕlu||)
kanusannanuṁḍevārim̐ gām̐giḍam̐ jŏkkiṁchi kūḍi
panni yĕṁtamanniṁchevu bhaḽibhaḽi
nannum̐ galasidi vidĕ nammiṁchi śhrī veṁkaḍeśha
yĕnnigainaberum̐ gīrdiyiṁtayu nīsedidi