తెలుసుకో యిఁక నీవు తేటతెల్లమిగ మమ్ము
(॥పల్లవి॥)
తెలుసుకో యిఁక నీవు తేటతెల్లమిగ మమ్ము
తలఁచుకో వారివంటిదాననె యింతనుండి
(॥తెల॥)
యిచ్చక మాడేటివారు యిన్నిటా నితవరులు
నిచ్చ బుద్ది చెప్పేవారె నిష్టూరులు
యెచ్చుకుంద లింతేసి యెరఁగ నైతి నిన్నాళ్లు
తచ్చన నే వారితోదాననె యింతనుండి
(॥తెలు॥)
మాయలు నేర్చినవారు మహిలోన జాణలు
నాయాలు నడచేవారె నాలికూళలు
బాయలుపందిలి వన్ని భ్రమించ నైతి నిన్నాళ్లు
దాయగత్తెనై వారిలోదాననె యింతనుండి
(॥తెలు॥)
గక్కన జంకించువారె కందువచనవరులు
చిక్కి లోనై నవారె జిగి వెఱ్ఱులు
యిక్కువ శ్రీవెంకటేశ యెనసితి నేఁడిన్నాళ్లు
తక్కక నీవారిలోదాననె యింతనుండి
(||pallavi||)
tĕlusugo yim̐ka nīvu teḍadĕllamiga mammu
talam̐sugo vārivaṁṭidānanĕ yiṁtanuṁḍi
(||tĕla||)
yichchaga māḍeḍivāru yinniḍā nidavarulu
nichcha buddi sĕppevārĕ niṣhṭūrulu
yĕchchuguṁda liṁtesi yĕram̐ga naidi ninnāḽlu
tachchana ne vāridodānanĕ yiṁtanuṁḍi
(||tĕlu||)
māyalu nersinavāru mahilona jāṇalu
nāyālu naḍasevārĕ nāligūḽalu
bāyalubaṁdili vanni bhramiṁcha naidi ninnāḽlu
dāyagattĕnai vārilodānanĕ yiṁtanuṁḍi
(||tĕlu||)
gakkana jaṁkiṁchuvārĕ kaṁduvasanavarulu
sikki lonai navārĕ jigi vĕṭrulu
yikkuva śhrīvĕṁkaḍeśha yĕnasidi nem̐ḍinnāḽlu
takkaga nīvārilodānanĕ yiṁtanuṁḍi