(॥పల్లవి॥)
తెలుసుకో నీపేరు దేవుఁడవట
కలగాదు నిజ తారుకాణలట
(॥తెలు॥)
అల్లాడ నొకలేమ అడిగితిననె నిన్ను
వల్లెగా నీకేమిగావలెనోకాని
చల్లుఁజూపుల జవరాలు చక్కనిది యాకెరూపు
యెల్లచోటఁ దనపేరు యిందిరయట
(॥తెలు॥)
మక్కువ నాడినమాఁట మఱవకుమనె నిన్ను
యెక్కువ నీవాకెతోడ యెన్నఁడోకాని
తొక్కినపదములోని దొమ్మివేళఁ దోఁచునట
చిక్కుల జెప్పినఁ బచ్చినదేరునట
(॥తెలు॥)
యింతలోనే వచ్చి తా నీయెదుట నిన్నియు ననె
మంతనాన యెంతటితమకమోకాని
వింతగా శ్రీవేంకటేశ వెలఁదిఁ గూడితి విట్టె
మంతుకెక్కె విన్నియు నీమహిమలట
(||pallavi||)
tĕlusugo nīberu devum̐ḍavaḍa
kalagādu nija tārugāṇalaḍa
(||tĕlu||)
allāḍa nŏgalema aḍigidinanĕ ninnu
vallĕgā nīgemigāvalĕnogāni
sallum̐jūbula javarālu sakkanidi yāgĕrūbu
yĕllasoḍam̐ danaberu yiṁdirayaḍa
(||tĕlu||)
makkuva nāḍinamām̐ṭa maṟavagumanĕ ninnu
yĕkkuva nīvāgĕdoḍa yĕnnam̐ḍogāni
tŏkkinabadamuloni dŏmmiveḽam̐ dom̐sunaḍa
sikkula jĕppinam̐ bachchinaderunaḍa
(||tĕlu||)
yiṁtalone vachchi tā nīyĕduḍa ninniyu nanĕ
maṁtanāna yĕṁtaḍidamagamogāni
viṁtagā śhrīveṁkaḍeśha vĕlam̐dim̐ gūḍidi viṭṭĕ
maṁtugĕkkĕ vinniyu nīmahimalaḍa