తెలునో తెలియవో తెల్లమిగా మీకు నివి
(॥పల్లవి॥)
తెలునో తెలియవో తెల్లమిగా మీకు నివి
కలికిచేఁతలు చూచి కాంత లెల్లా మెచ్చేరు
(॥తెలునో॥)
చెలి నీయెడకు వెలుపలనే సిగ్గులు గాని
తలఁపులోఁ బిక్కటిల్లీ తమకములే
వలిపెపుఁ బయ్యదను వట్టి ముసుఁ గిడెఁ గాని
వెలి కురికినవే వింతవింత చూపులు
(॥తెలునో॥)
తరుణికొలువులోన తల వంచుకొనుఁ గాని
సిరుల నవ్వు దొలఁకీ సెలవులను
తెరమాటు సేసుకొని దీమసము చూపీఁ గాని
సరవులమాట లెల్లా చల్లీ వీనులకు
(॥తెలునో॥)
యిందుముఖిని కౌఁగిట యిట్టే గుట్టు చూపీఁ గాని
చిందేటిచెమట లెల్లా చెక్కు లనవే
కందువ శ్రీవేంకటేశ కలసితి వీకెను
మందెమేళ మింతే కాని మరిగె నీ దేవులు
(||pallavi||)
tĕluno tĕliyavo tĕllamigā mīgu nivi
kaligisem̐talu sūsi kāṁta lĕllā mĕchcheru
(||tĕluno||)
sĕli nīyĕḍagu vĕlubalane siggulu gāni
talam̐pulom̐ bikkaḍillī tamagamule
valibĕbum̐ bayyadanu vaṭṭi musum̐ giḍĕm̐ gāni
vĕli kuriginave viṁtaviṁta sūbulu
(||tĕluno||)
taruṇigŏluvulona tala vaṁchugŏnum̐ gāni
sirula navvu dŏlam̐kī sĕlavulanu
tĕramāḍu sesugŏni dīmasamu sūbīm̐ gāni
saravulamāḍa lĕllā sallī vīnulagu
(||tĕluno||)
yiṁdumukhini kaum̐giḍa yiṭṭe guṭṭu sūbīm̐ gāni
siṁdeḍisĕmaḍa lĕllā sĕkku lanave
kaṁduva śhrīveṁkaḍeśha kalasidi vīgĕnu
maṁdĕmeḽa miṁte kāni marigĕ nī devulu