తెలుకోవయ్య నీవే దిష్టమిది మోహము
(॥పల్లవి॥)
తెలుకోవయ్య నీవే దిష్టమిది మోహము
కలకాలమును నీపైఁ గలది నా మోహము
(॥తెలు॥)
ఆయములు గరఁగేటిఅదివో మోహము
చాయలకు లోనైనదే సరి మోహము
పోయినానుఁ బోనీక పొదిగినది మోహము
యీఁయెడ నెగ్గులుసిగ్గు లెంచనిదె మోహము
(॥తెలు॥)
మంతనమె యేపొద్దు మరిగినది మోహము
దొంతి పులకల తొప్పఁదోగేఁ మోహము
వొంతలేనినవ్వుల వేడుకలే మోహము
బంతిరతుల నేపొద్దుఁ బరగుటే మోహము
(॥తెలు॥)
కన్నులఁగనినప్పుడు కాఁగిలించుటే మోహము
వన్నెలకు మాటగడవనిఁ మోహము
ఇన్నిటాను శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి
వున్నతి నలుగ కిట్టె వుండుటే మోహము
(||pallavi||)
tĕlugovayya nīve diṣhṭamidi mohamu
kalagālamunu nībaim̐ galadi nā mohamu
(||tĕlu||)
āyamulu garam̐geḍiadivo mohamu
sāyalagu lonainade sari mohamu
poyinānum̐ bonīga pŏdiginadi mohamu
yīm̐yĕḍa nĕggulusiggu lĕṁchanidĕ mohamu
(||tĕlu||)
maṁtanamĕ yebŏddu mariginadi mohamu
dŏṁti pulagala tŏppam̐dogem̐ mohamu
vŏṁtaleninavvula veḍugale mohamu
baṁtiradula nebŏddum̐ baraguḍe mohamu
(||tĕlu||)
kannulam̐ganinappuḍu kām̐giliṁchuḍe mohamu
vannĕlagu māḍagaḍavanim̐ mohamu
inniḍānu śhrī veṁkaḍeśha nannum̐ gūḍidivi
vunnadi naluga kiṭṭĕ vuṁḍuḍe mohamu