తెలుకో ఇఁక నీవే తేటతెల్లమిగ నివి
(॥పల్లవి॥)
తెలుకో ఇఁక నీవే తేటతెల్లమిగ నివి
అలయించే కొరకా పొందయ్యే కొరకుఁ గాక
(॥తెలు॥)
నే మోహించినది యెల్ల నిన్ను దూరే కొరకా
గోమున గూడి చొక్కించే కొరకు గాక
చేముట్టి నీమేన గోర జీరదీసే కొరకా
ప్రేమాన సేసవెట్టి మెప్పించే కొరకుఁ గాక
(॥తెలు॥)
ఆలనై వుండుట నే నిన్నారడి బెట్టే కొరకా
గోలనై వేడుక సేసే కొరకు గాక
వేళగాచి పిలిచేది వేసరించే కొరకా
కీలెఱిగి నిన్ను మరిగించే కొరకుఁ గాక
(॥తెలు॥)
చుట్టరికము చెప్పేది సొలసేటి కొరకా
గుట్టుతోడ బాయకుండే కొరకుఁ గాక
ఇట్టె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నీవు
వెట్టిసేవకొరా నవ్వించే కొరకుఁ గాక.
(||pallavi||)
tĕlugo im̐ka nīve teḍadĕllamiga nivi
alayiṁche kŏragā pŏṁdayye kŏragum̐ gāga
(||tĕlu||)
ne mohiṁchinadi yĕlla ninnu dūre kŏragā
gomuna gūḍi sŏkkiṁche kŏragu gāga
semuṭṭi nīmena gora jīradīse kŏragā
premāna sesavĕṭṭi mĕppiṁche kŏragum̐ gāga
(||tĕlu||)
ālanai vuṁḍuḍa ne ninnāraḍi bĕṭṭe kŏragā
golanai veḍuga sese kŏragu gāga
veḽagāsi pilisedi vesariṁche kŏragā
kīlĕṟigi ninnu marigiṁche kŏragum̐ gāga
(||tĕlu||)
suṭṭarigamu sĕppedi sŏlaseḍi kŏragā
guṭṭudoḍa bāyaguṁḍe kŏragum̐ gāga
iṭṭĕ śhrīveṁkaḍeśha yelidivi nannu nīvu
vĕṭṭisevagŏrā navviṁche kŏragum̐ gāga.