Telubamga raadidi devuni maayalu

తెలుపఁగ రాదిది దేవుని మాయలు
Language

(॥పల్లవి॥)
తెలుపఁగ రాదిది దేవుని మాయలు
ఫల మెఱఁగరు యీ పట్టిన వెఱ్ఱి

(॥తెలు॥)
పుట్టిరి దివిజులు పురుషోత్తమునం-
దట్టే యణఁగిరి యతనందు
యిట్టే యీతని యిందరితో సరి-
వెట్టి కొలుచుటే పెనువెఱ్ఱి

(॥తెలు॥)
హరివరముననే యందరు బదికిరి
పరుల వరము గని బడలిరి యసురలు
యిరవెఱిఁ గీతని నిందరి లోపల
సరిగా మొక్కుట సహజపువెఱ్ఱి

(॥తెలు॥)
జీవాంతరాత్ముఁడు శ్రీవేంకటేశుఁడు
యేవల శ్రీలక్ష్మి యీతని దేవులు
వేవేలు సిరులు వీరె యొసఁగిరని
భావించువారికిఁ బట్టదు వెఱ్ఱి

(||pallavi||)
tĕlubam̐ga rādidi devuni māyalu
phala mĕṟam̐garu yī paṭṭina vĕṭri

(||tĕlu||)
puṭṭiri divijulu puruṣhottamunaṁ-
daṭṭe yaṇam̐giri yadanaṁdu
yiṭṭe yīdani yiṁdarido sari-
vĕṭṭi kŏlusuḍe pĕnuvĕṭri

(||tĕlu||)
harivaramunane yaṁdaru badigiri
parula varamu gani baḍaliri yasuralu
yiravĕṟim̐ gīdani niṁdari lobala
sarigā mŏkkuḍa sahajabuvĕṭri

(||tĕlu||)
jīvāṁtarātmum̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍu
yevala śhrīlakṣhmi yīdani devulu
vevelu sirulu vīrĕ yŏsam̐girani
bhāviṁchuvārigim̐ baṭṭadu vĕṭri