తెల్లవారనియ్యరో తెరువు యీ
(॥పల్లవి॥)
తెల్లవారనియ్యరో తెరువు యీ-
పల్లదపు దొంగలెల్లఁ బారాడు తెరువు
(॥తెల్ల॥)
దొంతరపూవులతోఁట తూరుపుఁ దెరువు
చింతపూవుఁ దేనెలచెమ్మ తెరువు
సంతులేని సతియింటిచాయ తెరువు
యింతలోనె చలిఁబడి యెండదాఁకే తెరువు
(॥తెల్ల॥)
పాముపుట్ట గొంటిమీఁది పడుమటితెరువు
చీమకదొంతరలోనిచిన్న తెరువు
గాములుగాచుక యుండే గాలి తెరువు
యేమిటా నెక్కడవుత నెరఁగనితెరువు
(॥తెల్ల॥)
అన్ని దిక్కులునుఁ దానేయైవున్న తెరువు
పన్నీటి కాలువలబాట తెరువు
కన్నుల వేంకటపతిఁ గన్న తెరువు
మిన్నునేలఁగూడినమీఁది తెరవు
(||pallavi||)
tĕllavāraniyyaro tĕruvu yī-
palladabu dŏṁgalĕllam̐ bārāḍu tĕruvu
(||tĕlla||)
dŏṁtarabūvuladom̐ṭa tūrubum̐ dĕruvu
siṁtabūvum̐ denĕlasĕmma tĕruvu
saṁtuleni sadiyiṁṭisāya tĕruvu
yiṁtalonĕ salim̐baḍi yĕṁḍadām̐ke tĕruvu
(||tĕlla||)
pāmubuṭṭa gŏṁṭimīm̐di paḍumaḍidĕruvu
sīmagadŏṁtaralonisinna tĕruvu
gāmulugāsuga yuṁḍe gāli tĕruvu
yemiḍā nĕkkaḍavuda nĕram̐ganidĕruvu
(||tĕlla||)
anni dikkulunum̐ dāneyaivunna tĕruvu
pannīḍi kāluvalabāḍa tĕruvu
kannula veṁkaḍabadim̐ ganna tĕruvu
minnunelam̐gūḍinamīm̐di tĕravu