Teliyaraadu neemaaya teramaramgu pekku

తెలియరాదు నీమాయ తెరమరఁగు పెక్కు
Language

(॥పల్లవి॥)
తెలియరాదు నీమాయ తెరమరఁగు పెక్కు-
వలలఁ జిక్కక నిన్నే కొలువఁగవలయు

(॥తెలి॥)
చూడఁగ నీజగత్తుకు సూత్రధారివి నీవు
జోడై నీసూత్రాన నాడుచును సర్వంబునున్నది
యేడఁ జూచిన నీవుందు వెవ్వరికిఁ గానరావు
వోడక స్వతంత్ర మొకరిపై వేతువు

(॥తెలి॥)
మఱపించాఁ దలఁపించా మర్మజ్ఞుఁడవు నీవు
గుణియై నీసంకల్పము కొలఁదే యీజీవులెల్లా
మఱి నీ వీశ్వరుఁడవు మాఁటలకుఁ జిక్కవు
కఱకరి నితరులఁ గర్తలఁగాఁ జేతువు

(॥తెలి॥)
అందరిమొర లాలించి అట్టె రక్షింతువు నీవు
కందువ శ్రీవేంకటేశ కానవచ్చె నీమహిమ
చెంది వరము లిత్తువు చేతికి సులభుఁడవు
సందడి నెవ్వరినైనా సరిగా మన్నింతువు

(||pallavi||)
tĕliyarādu nīmāya tĕramaram̐gu pĕkku-
valalam̐ jikkaga ninne kŏluvam̐gavalayu

(||tĕli||)
sūḍam̐ga nījagattugu sūtradhārivi nīvu
joḍai nīsūtrāna nāḍusunu sarvaṁbununnadi
yeḍam̐ jūsina nīvuṁdu vĕvvarigim̐ gānarāvu
voḍaga svadaṁtra mŏgaribai veduvu

(||tĕli||)
maṟabiṁchām̐ dalam̐piṁchā marmajñum̐ḍavu nīvu
guṇiyai nīsaṁkalbamu kŏlam̐de yījīvulĕllā
maṟi nī vīśhvarum̐ḍavu mām̐ṭalagum̐ jikkavu
kaṟagari nidarulam̐ gardalam̐gām̐ jeduvu

(||tĕli||)
aṁdarimŏra lāliṁchi aṭṭĕ rakṣhiṁtuvu nīvu
kaṁduva śhrīveṁkaḍeśha kānavachchĕ nīmahima
sĕṁdi varamu littuvu sedigi sulabhum̐ḍavu
saṁdaḍi nĕvvarinainā sarigā manniṁtuvu