తెలియరాదు నీ మది దిమ్మరివాఁడవు గాన
(॥పల్లవి॥)
తెలియరాదు నీ మది దిమ్మరివాఁడవు గాన
చెలరేఁగి యడిగేము చెప్పరాదా మాకు
(॥॥)
అగ్గమై యందరిలో నానతీవఁ గాఁగిలించఁగా
సిగ్గుపడి సన్న సేసీఁ జేతనే నీకు
కగ్గి నీకు యీపె నింత కాకు సేయవలశో
నిగ్గులవలపు నీకు నిక్కమును గలదో
(॥॥)
సకులెల్లాఁ జూడఁగాను చవులమో వెడిగితే
మోకము వంచి కన్నుల మొక్కు మొక్కీని
ప్రకటించి యీపె నింత పచ్చి సేసేనంటానో
వొకట మేలువాఁడవై వొనరినచందమో
(॥॥)
పూడిగపువారుండఁగా నొద్దికై పెనఁగితేను
యీడనె శ్రీవేంకటేశ యీ కె నవ్వీని
జాడతో నీపె నింత సమఁతు సేయవలశో
వేడుకకాడవై నవిధ మిటువంటిదో
(||pallavi||)
tĕliyarādu nī madi dimmarivām̐ḍavu gāna
sĕlarem̐gi yaḍigemu sĕpparādā māgu
(||||)
aggamai yaṁdarilo nānadīvam̐ gām̐giliṁcham̐gā
siggubaḍi sanna sesīm̐ jedane nīgu
kaggi nīgu yībĕ niṁta kāgu seyavalaśho
niggulavalabu nīgu nikkamunu galado
(||||)
sagulĕllām̐ jūḍam̐gānu savulamo vĕḍigide
mogamu vaṁchi kannula mŏkku mŏkkīni
pragaḍiṁchi yībĕ niṁta pachchi sesenaṁṭāno
vŏgaḍa meluvām̐ḍavai vŏnarinasaṁdamo
(||||)
pūḍigabuvāruṁḍam̐gā nŏddigai pĕnam̐gidenu
yīḍanĕ śhrīveṁkaḍeśha yī kĕ navvīni
jāḍado nībĕ niṁta samam̐tu seyavalaśho
veḍugagāḍavai navidha miḍuvaṁṭido