తెలియరా దీయింతి తెఱఁగులును మొఱఁగులును
(॥పల్లవి॥)
తెలియరా దీయింతి తెఱఁగులును మొఱఁగులును
అలవాటు గలదు గనకవి నీకే తెలుసు
(॥తెలి॥)
తలఁచు నినుఁ గాఁగిటను తలగడటు బిగియించు
చెలుల మొగములు చూచి సిగ్గువడును
కలయ నినుఁ బేరుకొను కడలఁ జెప్పకుమనుచు
చిలుకఁ గడుబోదించి చిఱునవ్వు నగును
(॥తెలి॥)
పెదవి పై నిను సొలసి బింబఫల మటు సోపు
మదనకళ లెసఁగ దెరమఱఁ గిడుకొను
వుదుటుగుబ్బలను గోరొత్తు లటు వాసుకొని
పదకంబు వాఁటిపైఁ బాదుకొనఁజేసు
(॥తెలి॥)
వరపు పై నిను వెదకి బయలు సరసములాడు
మరుచేఁతలని తెలిసి మనసు గరఁగు
నిరతి శ్రీవేంకటేశ నీవు గూడఁగఁ జెలియ
మరిగి యాకతలు వేమరు నెంచుకొనును
(||pallavi||)
tĕliyarā dīyiṁti tĕṟam̐gulunu mŏṟam̐gulunu
alavāḍu galadu ganagavi nīge tĕlusu
(||tĕli||)
talam̐su ninum̐ gām̐giḍanu talagaḍaḍu bigiyiṁchu
sĕlula mŏgamulu sūsi sigguvaḍunu
kalaya ninum̐ berugŏnu kaḍalam̐ jĕppagumanusu
silugam̐ gaḍubodiṁchi siṟunavvu nagunu
(||tĕli||)
pĕdavi pai ninu sŏlasi biṁbaphala maḍu sobu
madanagaḽa lĕsam̐ga dĕramaṟam̐ giḍugŏnu
vuduḍugubbalanu gorŏttu laḍu vāsugŏni
padagaṁbu vām̐ṭibaim̐ bādugŏnam̐jesu
(||tĕli||)
varabu pai ninu vĕdagi bayalu sarasamulāḍu
marusem̐talani tĕlisi manasu garam̐gu
niradi śhrīveṁkaḍeśha nīvu gūḍam̐gam̐ jĕliya
marigi yāgadalu vemaru nĕṁchugŏnunu