తెలియఁ జెప్పితి మీకె తెరఁగెల్లా నిదె నీకు
(॥పల్లవి॥)
తెలియఁ జెప్పితి మీకె తెరఁగెల్లా నిదె నీకు
తలఁపునఁ బెట్టుకొని దయఁజూడు మికను
(॥తెలి॥)
నెలఁత వేగినంతాను నీతోడికలలె కను
నలువంకా మరి సగినాలు చూచును
చెలుల నీవద్ది కంపి చేరి సుద్దు లడుగును
చెలియభాగ్యము నీచిత్త మిఁకను
(॥తెలి॥)
భామ నీపై బదాలు చెప్ప నుపమలు దలఁచు
ఆముక పటాన నీరూపటు వాసును
నేమాన మేడలెక్కి నీనగరు చూచి మొక్కు
యేమనము యిన్నీ నీవే యెఱుఁగుదు విఁకను
(॥తెలి॥)
ఇంతి పానుపుపై నుండి యెదురులుచూచు నీకు
చెంత నీవున్నాఁడవని చెనకి నవ్వు
ఇంతలో శ్రీవేంకటేశ ఇట్టెవచ్చి కూడితివి
పంతమెల్లా యీడేరె పాయకుండు మిఁకను
(||pallavi||)
tĕliyam̐ jĕppidi mīgĕ tĕram̐gĕllā nidĕ nīgu
talam̐punam̐ bĕṭṭugŏni dayam̐jūḍu miganu
(||tĕli||)
nĕlam̐ta veginaṁtānu nīdoḍigalalĕ kanu
naluvaṁkā mari saginālu sūsunu
sĕlula nīvaddi kaṁpi seri suddu laḍugunu
sĕliyabhāgyamu nīsitta mim̐kanu
(||tĕli||)
bhāma nībai badālu sĕppa nubamalu dalam̐su
āmuga paḍāna nīrūbaḍu vāsunu
nemāna meḍalĕkki nīnagaru sūsi mŏkku
yemanamu yinnī nīve yĕṟum̐gudu vim̐kanu
(||tĕli||)
iṁti pānububai nuṁḍi yĕdurulusūsu nīgu
sĕṁta nīvunnām̐ḍavani sĕnagi navvu
iṁtalo śhrīveṁkaḍeśha iṭṭĕvachchi kūḍidivi
paṁtamĕllā yīḍerĕ pāyaguṁḍu mim̐kanu